యాప్నగరం

Indian Truckers: 'దేవుడే మా కోసం Hindenburg ను పంపాడు'.. భారత ట్రక్ డ్రైవర్ల థ్యాంక్స్.. అసలేమైందంటే?

Indian Truckers: హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. అదానీ గ్రూప్‌ను ఎంత తిప్పలు పెట్టిందో, పెడుతుందో తెలిసిందే. ఇప్పటికీ.. హిండెన్‌బర్గ్ నివేదిక (Hindenburg Report) దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. అయితే.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను దేవుడే తమ కోసం పంపాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్లు (Truck Drivers). అసలు సంగతేంటంటే?

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 10 Mar 2023, 7:57 pm
Himachal Truckers: అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రిపోర్ట్ (Hindenburg Research).. అదానీ గ్రూప్‌ను (Adani Group) కుదిపేసింది. అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలేలా చేసింది. మార్కెట్ క్యాప్ లక్షల కోట్ల మేర పతనమైంది. గౌతమ్ అదానీ (Gautam Adani) వ్యక్తిగత సంపద కూడా లక్షల కోట్ల మేర పడిపోయింది. అయితే.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) కూడా పడిపోతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద కూడా ఆవిరవుతోంది. అయినా.. ఈ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌కు ఇప్పుడు థ్యాంక్స్ చెబుతున్నారు హిమాచల్ ప్రదేశ్‌లోని ట్రక్ డ్రైవర్లు. తమను ఆదుకునేందుకే దేవుడు.. Hindenburg రూపంలో వచ్చాడని అంటున్నారు. అదానీని అంతలా ఇరుకున పెట్టిన ఈ హిండెన్‌‌బర్గ్‌ను వీరు ఎందుకు పొగుడుతున్నారో ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu Adani truck drivers


హిమాచల్ ప్రదేశ్ గాగల్, దార్లఘాట్‌లోని అదానీ గ్రూప్‌‌నకు చెందిన 2 సిమెంట్ ప్లాంట్లను మూయాలని డిసెంబర్ 15న సంస్థ నిర్ణయించుకుంది. సిమెంట్ సరఫరా కోసం ట్రక్కు డ్రైవర్లు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. సిమెంట్ ప్లాంట్ నడపడం లాభదాయకం ఏ మాత్రం కాదని సంస్థ ప్రకటించింది. సరఫరా చేసేందుకు టన్ను సిమెంట్ కోసం.. కిలోమీటర్‌కు రూ.11 చొప్పున డ్రైవర్లు వసూలు చేస్తున్నారని, దీనిని సగంపైగా తగ్గించాలని కోరింది. అయితే.. ఈ సమయంలోనే అదానీ గ్రూప్ నిర్ణయం సరైనది కాదని, ఇది తమ జీవితాలపై ప్రభావం చూపుతుందని ట్రక్ డ్రైవర్లు నిరసనకు దిగారు. దీంతో డ్రైవర్లు, అదానీ గ్రూప్ మధ్య చర్చలు కూడా విఫలమయ్యాయి.

'భారత్ నాకు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది'.. India ను మెచ్చుకుంటూ Bill Gates ప్రశంసల వర్షం..

Ambani Niece: అంబానీ మేనకోడలు Isheta గురించి తెలుసా.. కోట్ల సంపద.. లగ్జరీ లైఫ్ అదిరింది కదా!

తమ నిరసనకు తొలుత మద్దతు పెద్దగా లభించలేదని ఆ ట్రక్ డ్రైవర్ల సంఘం ప్రతినిధి రామ్ కిషన్ శర్మ అన్నారు. ఇక హిండెన్‌బర్గ్ రిపోర్ట్ జనవరి 25న వెలుగులోకి వచ్చాక.. స్థానిక వ్యాపారులు, కార్మిక సంఘాలు తమకు మద్దతు పలికేందుకు వచ్చినట్లు చెప్పారు. దీంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు అక్కడి డ్రైవర్లతో తాజాగా మరోసారి చర్చలు జరిపారు. సిమెంట్ సరఫరాకు వసూలు చేస్తున్న మొత్తంలో 10 శాతం తగ్గించనున్నట్లు అందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. దీంతో డ్రైవర్లు నిరసనను విరమించుకున్నారు. ఇక సిమెంట్ ప్లాంట్లు మునుపటిలానే పనిచేస్తాయని అదానీ గ్రూప్ కూడా ప్రకటించింది. ఇక హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగానే అదానీ గ్రూప్ వెనక్కి తగ్గిందని, అందుకే ఆ రిపోర్ట్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు ట్రక్ డ్రైవర్లు.

ఇక హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అదానీ సామ్రాజ్యం పడిపోతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ కూడా ఏకంగా 29వ స్థానానికి పడిపోయారు. మార్కెట్ విలువ కుప్పకూలుతోంది. ఇక రిపోర్ట్ వచ్చిన తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO ను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం ఈ అదానీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సొమ్ము పతనంపై అదానీ వ్యవహారం నేపథ్యంలో ఈ కేసు సుప్రీం కోర్టులో ఉంది. అత్యున్నత ధర్మాసనం దీనిపై ఒక కమిటీని నియమించనున్నట్లు తెలిపింది. ఇక.. ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసం నింపాలని అదానీ గ్రూప్ భావిస్తోంది.

Mansa Musa: ప్రపంచంలో సగం Gold ఇతని దగ్గరే.. అపార సంపద.. ఎంత తిన్నా తరగని ఆస్తి! Bonus: ఒక్కో ఉద్యోగికి రూ.3.5 లక్షల బోనస్.. మొత్తం 20 వేల మందికి.. కంపెనీ అంటే ఇలా ఉండాలి కదా?

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.