యాప్నగరం

Smart Phones: ఫోన్లలో మహిళలు ఎక్కువగా అవే చూస్తుంటే మరి పురుషులేం చూస్తున్నారు..? ఆసక్తికర విషయాలివే..

Mobile Apps: మొబైల్ యాప్స్ ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీటి వినియోగంలో పురుషులు ఎక్కువగా గేమింగ్ యాప్‌లపై దృష్టి కనబరుస్తున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే.. మెసేజింగ్, ఆహార సంబంధిత యాప్స్‌ను ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఇంకా వీటికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఏంటంటే?

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 1 May 2023, 1:38 pm
Mobile Apps: భారత్‌లో స్మార్‌ఫోన్ వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫోన్‌లో మునిగిపోయే సమయం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 50 శాతం పెరిగింది. తాజాగా బొబ్బల్ ఏఐ (Bobble AI) అనే ఒక కీ బోర్డ్ సంస్థ తాజాగా ఒక సర్వే నిర్వహించగా.. ఆ నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. సుమారు 85 మిలియన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల డేటాను ఇందుకోసం విశ్లేషించింది. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో దేశంలో పురుషులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలిపింది. అలాగే ఎక్కువ మంది పురుషులు గేమింగ్ యాప్స్‌ను ఇష్టపడుతుంటే.. మహిళలు మాత్రం ఫుడ్, మెసేజింగ్ యాప్స్‌ను ఇష్టపడుతున్నట్లు తేలింది.
Samayam Telugu mobile apps


ఇక మొత్తం యూజర్ల విషయానికి వస్తే డిజిటల్ పేమెంట్ యాప్స్‌ను కేవలం 11.3 శాతం మంది మహిళలే ఉపయోగిస్తున్నారట. గేమింగ్ యాప్స్ పట్ల 6.1 శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారట. పురుషులే ఇక ఈ విషయంలో ముందంజలో ఉన్నారు.

మహిళల్లో 23.3 శాతం మంది కమ్యూనికేషన్ యాప్స్ ఉపయోగిస్తుంటే.. 21.7 శాతం మంది వీడియో యాప్స్.. 23.5 శాతం ఫుడ్ యాప్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారని నివేదికలో పేర్కొంది. 2022, 2023ల్లో సేకరించిన డేటా ఆధారంగా వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండానే ఈ సర్వేను నిర్వహించినట్లు తెలిపింది.

TV, కంప్యూటర్లలో బంగారం ఉంటుంది.. గోల్డ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

పెట్రోల్ బంక్ లైసెన్స్ ఎలా పొందాలి.. అర్హతలేంటి? ఖర్చెంత.. లాభం ఎంత?

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.