యాప్నగరం

Indian Railways: భారతీయ రైల్వే ప్లాన్.. టిక్కెట్ బుకింగ్ సిస్టమ్ అంతా మార్పు!

Indian Railways: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి రైల్వే టిక్కెట్ బుక్ చేసుకోవాలని చూశారా..? కానీ సర్వర్ సతాయిస్తుందా..? అసలు టిక్కెట్లు దొరుకుతాయో లేదోనని టెన్షన్‌గా ఉందా..? అయితే ఇక నుంచి ఈ సమస్యలన్నింటికి భారతీయ రైల్వే చెక్ పెట్టబోతుంది. తన ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను సమూలంగా మార్చాలని చూస్తోంది. దీని కోసం కసరత్తులు కూడా ప్రారంభించింది. ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీకి ఈ పనిని అప్పజెప్పింది. ప్రస్తుత సిస్టమ్‌ను ఆడిట్ చేసి, లోపాలను చెప్పమని కోరింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 17 Aug 2022, 3:46 pm

ప్రధానాంశాలు:

  • ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పులు
  • ఫేక్ ఐడీలతో సర్వర్లను సతాయిస్తోన్న యూజర్లపై వేటు
  • గ్రాంట్ థోర్టన్ ఏజెన్సీకు ఆడిట్ చేసే బాధ్యత అప్పగింత
  • 2005లోనే ఈ-రిజర్వేషన్ సిస్టమ్ అందుబాటులోకి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Indian Railways
భారతీయ రైల్వే
Indian Railways: ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్‌‌ను సమూలంగా మార్చాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఫేక్ ఐడీలతో రైల్వే టిక్కెట్ బుకింగ్ సిస్టమ్‌లో గేమింగ్‌కు పాల్పడుతున్న నకిలీ యూజర్లను తీసివేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. దీని కోసం మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోన్న ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పులు చేపడుతోంది.
గ్రాంట్ థోర్టన్ రిపోర్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ ఏడాది చివరిలో ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను పునరుద్ధరించడం ప్రారంభించాలని భారతీయ రైల్వే చూస్తోంది. భారతీయ రైల్వే టిక్కెటింగ్, కేటరింగ్, టూరిజం సర్వీసులను నిర్వహించే ప్రభుత్వ కంపెనీ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రస్తుత తన సిస్టమ్‌ను ఆడిట్ చేసే బాధ్యతను గ్రాంట్ థోర్టన్ కన్సల్టెన్సీకి అప్పజెప్పింది. ఈ సిస్టమ్‌ మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలను ఇవ్వాలని ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీ భారతీయ రైల్వే కోరినట్టు తెలిసింది.

పలు సంవత్సరాలుగా ఎన్ని మార్పులు చేపట్టినప్పటికీ.. ఇంకా భారతీయ రైల్వేకి చెందిన టిక్కెట్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రయాణికులకు అసౌకర్యంగానే ఉంటుంది. 2005లో ఈ-రిజర్వేషన్ సిస్టమ్‌ను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది. కానీ హెవీ ట్రాఫిక్‌తో కొన్ని సార్లు సర్వర్లలో సమస్యలు వస్తున్నాయి. ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఈ సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తోంది. పెద్ద మొత్తంలో లావాదేవీలను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేలా ఈ సిస్టమ్‌ను మారుస్తోంది. కోర్ అప్లికేషన్‌కు ఇది బలోపేతాన్ని ఇస్తుంది.

ఫేక్ ఐడీలను వాడుతూ సిస్టమ్‌పై ఒత్తిడిని తెస్తోన్న తప్పుడు ఉద్దేశ్యపూర్వక యూజర్లను కూడా చెక్ చేసి, తీసివేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. తత్కాల్ టిక్కెట్ల విషయంలో ప్రయాణికులు ఫేక్ ఐడీల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా IRCTC websiteను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసి, బలోపేతం చేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక మరింత ట్రాఫిక్‌ను ఈ సర్వర్ హ్యాండిల్ చేసేలా మారుస్తోంది.

Also Read :Ratan Tata: మంచి తోడు దొరకడం నిజంగా సవాలే.. ‘ఒంటరితనంపై’ రతన్ టాటా

Also Read : శుభవార్త చెప్పిన బ్యాంకు, డబ్బులు దాచుకున్న వారికి ఎక్కువ ఆదాయం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.