యాప్నగరం

Train ప్యాసింజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం!

ఇండియన్ రైల్వేస్ శుభవార్త అందించింది. కొత్త తరహా ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. 190 కొత్త ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి.

Samayam Telugu 24 Nov 2021, 3:39 am

ప్రధానాంశాలు:

  • రైల్వే ప్రయాణికులకు తీపికబురు
  • కొత్త తరహా ట్రైన్స్
  • త్వరలో అందుబాటులోకి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu railways
ట్రైన్ ప్యాసింజర్లకు అలర్ట్. ఇండియన్ రైల్వేస్ తీపికబురు అందించింది. ప్రయాణికులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది.
టూరిజం లక్ష్యంగా కొత్త ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ప్యాసింజర్, గూడ్స్ విభాగాల్లో రైళ్లను నడుపుతోందని, రానున్న కాలంలో భారత్ గౌరవ్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.

ఈ ట్రైన్స్ భారతదేశ సంస్కృతిని, వారసత్వాన్ని సూచించేలా ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 3,033 కోచ్‌లను లేదా 190 ట్రైన్స్‌ను గుర్తించామని పేర్కొన్నారు. ఇవి భారత్ గౌరవ్ ట్రైన్స్‌గా పట్టాలపై పరుగులు పెడతాయన్నారు. ప్రైవేట్, ఐఆర్‌సీటీసీ సంస్థలు ఈ ట్రైన్లను నడుపుతాయని తెలిపారు. ఒడిశా, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇలాంటి ట్రైన్స్‌పై ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.