Indigo Offer: Book Domestic Flight Tickets Starting From Rs 999
Valentines Day Offer.. రూ.999కే విమాన టికెట్!
వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఇప్పటికే ఎవరి ప్లాన్లలో వారు ఉంటారు. అయితే మీకో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరకే విమానంలో ప్రయాణించే ఛాన్స్ ఒకటుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది.
Samayam Telugu12 Feb 2020, 9:19 am
వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఇప్పటికే ఎవరి ప్లాన్లలో వారు ఉంటారు. అయితే మీకో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరకే విమానంలో ప్రయాణించే ఛాన్స్ ఒకటుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది.
ఇండిగో ఆఫర్
దేశీ దిగ్గజ విమానయాన కంపెనీ ఇండిగో తాజాగా వాలెంటెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ 4 రోజులు అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 11 నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా విమాన టికెట్‌ను రూ.999కే బుక్ చేసుకోవచ్చు.
ఇండిగో తన వాలెంటెన్స్ డే ఆఫర్లో భాగంగా 10 లక్షల సీట్లను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచింది. వీటికి మాత్రమే డిస్కౌంట్ ధర వర్తిస్తుంది. ఈ సీట్లు ముందుగానే బుక్ అయిపోతే ఆఫర్ అందుబాటులో ఉండదు.
ఇండిగో తాజా డిస్కౌంట్ ఆఫర్‌తో వాలెంటెన్స్ డే సెలబ్రేషన్స్ ముందుగానే ప్రారంభమయ్యాయి. విమాన టికెట్ల డిస్కౌంట్ ఆఫర్ ఫిబ్రవరి 14 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియన్ బౌల్టర్ తెలిపారు.
వాలెంటెన్స్ డే ఆఫర్లో భాగంగా విమాన టికెట్ బుక్ చేసుకోవాలని భావిస్తే.. ముందుగా ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి టికెట్లను బుక్ చేసుకోవాలి. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లైట్ టికెట్ ఆఫర్ ధర రూ.999 నుంచి మొదలవుతున్నా... హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే ఇండిగో విమానాల్లో రూ.999 ధరకు టికెట్లు అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి కనీస టికెట్ ధర రూ.1,599గా ఉంది.
ఇండిగో వాలెంటెన్స్ డే ఆఫర్లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారు (ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 14లోపు) ఈ ఏడాది మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఆఫర్ సీట్లు అందుబాటులో ఉన్నంత వరకే ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఫ్లైట్ టికెట్ బుకింగ్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ పేజాప్ వాలెట్ నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే అదనంగా 15 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ల బుకింగ్‌పై 12 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.