యాప్నగరం

తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్.. కచ్చితంగా తెలుసుకోవలసిన అంశాలివే!

మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడతారు. బస్ చార్జీలతో పోలిస్తే ట్రైన్ టికెట్ ధర తక్కువగా ఉండటం, సౌకర్యవంతమైన ప్రయాణం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జర్నీ చేయాల్సి రావొచ్చు. అప్పుడు ట్రైన్ టికెట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవలసి ఉంటుంది.

Samayam Telugu 8 Jan 2020, 12:15 pm
మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడతారు. బస్ చార్జీలతో పోలిస్తే ట్రైన్ టికెట్ ధర తక్కువగా ఉండటం, సౌకర్యవంతమైన ప్రయాణం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జర్నీ చేయాల్సి రావొచ్చు. అప్పుడు ట్రైన్ టికెట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవలసి ఉంటుంది.
Samayam Telugu irctc tatkal train ticket booking rules charges and more
తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్.. కచ్చితంగా తెలుసుకోవలసిన అంశాలివే!


ఆన్‌లైన్ లేదా స్టేషన్లలో బుకింగ్ సౌకర్యం

రైల్వే ప్రయాణికుల అత్యవసర జర్నీ కోసం ఇండియన్ రైల్వేస్ తత్కాల్ టికెట్ బుకింగ్ స్కీ్మ్‌ను అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇండియన్ రైల్వేస్ రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి పతనం!

ప్రీమియం చార్జీలు ఉంటాయి

సాధారణ ట్రైన్ టికెట్ ధరతో పోలిస్తే తత్కాల్ ట్రైన్ టికెట్ ధర ఎక్కువగా ఉంటుంది. ట్రైన్ టికెట్లు సాధారణంగా స్టేషన్ నుంచి స్టేషన్‌కు ఇస్తారు. ఇక్కడ ధర కూడా స్టేషన్ నుంచి స్టేషన్‌ ప్రాతిపదికన ఉంటుంది. అదే తత్కాల్ ట్రైన్ టికెట్ విషయానికి వస్తే.. ఇక్కడ టికెట్ ప్రయాణపు దూరంపై ఆధారపడుతుంది. అందుకే డిస్టెన్స్ నిబంధనలను తత్కాల్ టికెట్లకు వర్తిస్తాయి.

Also Read: ఎస్‌బీఐ ముద్రా లోన్.. వారికి రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు రుణం.. ఇలా అప్లై చేసుకోండి!

చార్జీలు ఇలా

తత్కాల్ ట్రైన్ టికెట్ చార్జీ బేసిక్ ఫేర్‌పై ఆధారపడి ఉంటుంది. సెకండ్ క్లాస్ టికెట్‌కు తత్కాల్ ధర బేసిక్ ఫేర్‌లో 10 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇతర క్లాస్‌లకు 30 శాతం ఎక్కువ భారం పడుతుంది. దీనికి కూడా మినిమమ్, మాగ్జిమమ్ చార్జీలు వర్తిస్తాయి.

Also Read: Credit Cardsతో పేటీఎం నుంచి బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారా? మీకో భారీ షాక్!

ఏ క్లాస్ టికెట్‌కు ఎంత చార్జీ అంటే?

Also Read: ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేసుకుంటున్నారా? జాగ్రత్త.. వారి చేతిలో మోసపోవద్దు!

దూరం ప్రాతిపదికన చార్జీ ఇలా

బుకింగ్ టైమ్

తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమౌతుంది. ఇది ఏసీ క్లాస్ తరగతుల ప్రయాణ టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక నాన్ ఏసీ క్లాస్ తరగతి ప్రయాణానికి తత్కాల్ టికెట్ బుకింగ్ టైమ్ ఉదయం 11 నుంచి ప్రారంభమౌతుంది. మీరు ప్రయాణం చేయాలని భావించే తేదీకి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలి. అంటే ట్రైన్ రేపు బయలుదేరుతుంటే.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టికెట్ బుక్ చేసుకోవాలి.

Also Read: SBI ఏటీఎం క్యాష్‌ విత్‌డ్రా లిమిట్, చార్జీలు.. రోజుకు ఎంత డబ్బు తీసుకోవచ్చంటే..

నాలుగు టికెట్లే..

తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ స్కీమ్ కింద ఒక పీఎన్ఆర్ నెంబర్ కింద గరిష్టంగా నాలుగు టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలం. సాధారణంగా అయితే ఆరు టికెట్లను బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read: ఈ ప్లాన్‌తో మీ Credit Cardsకు పూర్తి రక్షణ.. రూ.299 చెల్లిస్తే చాలు!

క్యాన్సల్ చేసుకోలేం.. కానీ

సాధారణ ట్రైన్ టికెట్ల మాదిరిగా తత్కాల్ ట్రైన్ టికెట్లను క్యాన్సల్ చేసుకోవడం కుదరదు. అయితే ట్రైన్ మూడు గంటలకు పైన ఆలస్యమైతే అప్పుడు టికెట్ రద్దు చేసుకోవచ్చు. లేదంటే ట్రైన్ దారి మారినప్పుడు అంటే వేరే దారిలో ట్రైన్ నడిస్తే.. అలాంటి సందర్భాల్లో కూడా ట్రైన్ టికెట్ డబ్బులను రిఫండ్ పొందొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.