యాప్నగరం

Auto Insurance Rules : వాహనదారులకు గుడ్‌న్యూస్, ఎంత డ్రైవ్ చేస్తే అంతే ప్రీమియం

Auto Insurance Rules : ఆటో ఇన్సూరెన్స్‌ ప్రీమియాలకు సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఐఆర్‌డీఏఐ. ఇక నుంచి మీరు ఎంత డ్రైవ్ చేస్తే.. అంతకే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాక దూరాన్ని బట్టి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కింపులు ఉండనున్నాయి. ఒకటి కంటే ఎక్కువ వాహనాలుంటే.. ప్రతి దానికి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సినవసరం కూడా లేదు. అన్ని వాహనాలకు కలిపి ఒకే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ నిబంధనలను ఐఆర్‌డీఏఐ ప్రవేశపెట్టి.. వాహనదారులకి గుడ్ న్యూస్ చెప్పింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 7 Jul 2022, 4:32 pm

ప్రధానాంశాలు:

  • ఆటో ఇన్సూరెన్స్‌లకు సరికొత్త నిబంధనలు తెచ్చిన ఐఆర్‌డీఏఐ
  • ఇక నుంచి ఫిక్స్‌డ్ ప్రీమియాలకు కాలం చెల్లింపు
  • డ్రైవ్ చేసిన విధానం ప్రకారమే ప్రీమియం చెల్లింపు
  • వాహనాలన్నింటికి కలిపి ఒకే ఇన్సూరెన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Auto Insurance Rules
ఆటో ఇన్సూరెన్స్ రూల్స్
Auto Insurance Rules : మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ప్రతేడాది ఫిక్స్‌డ్‌గా చెల్లించే ప్రీమియాలకు కాలం చెల్లనుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) టెక్నాలజీ ఆధారిత యాడ్-ఆన్ పాలసీలను మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల కోసం ప్రవేశపెట్టేందుకు బీమా కంపెనీలకు అనుమతి కల్పించింది. ఈ పాలసీల కింద వాహనదారుల వాడకం, డ్రైవింగ్ హిస్టరీ ప్రకారమే ప్రీమియాలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్క వాహనానికి ప్రత్యేక పాలసీని వాహనదారులు తీసుకోవాల్సినవసరం లేకుండా.. పలు వాహనాలన్నింటికి కలిపి ఫ్లోటర్ పాలసీను కొనుగోలు చేసుకోవచ్చు. ఫ్లోటర్ పాలసీ అంటే సింగిల్ యాన్యువల్ ప్రీమియం పేమెంట్‌పైనే వాహనాలన్నింటికి ఒకే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
టెక్నాలజీ ఆధారిత కవర్‌ను అందించేందుకు ఐఆర్‌డీఏఐ ఈ సౌకర్యాలను కల్పిస్తోంది. ఐఆర్‌డీఏఐ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. వాహనందారుడు బైకును లేదా కారును డ్రైవ్ చేస్తున్నప్పుడే ప్రీమియం చెల్లించుకోవచ్చు, లేదంటే మీరు డ్రైవ్ చేసే విధానం ప్రకారం ఇన్సూరెన్స్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. అంతేకాక ఇండివిడ్యువల్ ఓనర్‌కు చెందిన వెహికిల్స్ అన్నింటికి ఫ్లోటర్ పాలసీని వర్తింపు జేయడం వంటి సౌకర్యాలను కల్పిస్తోంది.

Also Read : వంటనూనెల ధరల తగ్గింపుపై పతంజలి ప్రకటన.. లీటరుపై ఎంత తగ్గిస్తుందంటే..?
మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడే చెల్లింపులు చేయడమంటే.. వాడకం ప్రకారమే ఇన్సూరెన్స్ చెల్లించుకునేలా యూజర్లకు అనుమతివ్వడం. అయితే ర్యాష్ డ్రైవింగ్‌కు అత్యధిక ప్రీమియాలు వర్తిస్తాయి. అయితే వాహనదారుని డ్రైవింగ్ విధానాన్ని గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లేదా జీపీఎస్ ద్వారా మానిటర్ చేయనున్నారు. వెహికిల్‌లో మొబైల్ యాప్‌ను లేదా స్మాల్‌ డివైజ్‌ను ఉంచి.. ఆ సమాచారాన్ని షేర్ చేసుకోనున్నారు. అంతేకాక జీపీఎస్ సాయంతో, ఆ వెహికిల్ డ్రైవింగ్ విధానాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మానిటర్ చేయనుంది. అదే సమయంలో టెక్నాలజీ సాయంతో.. ప్రతి వెహికిల్‌‌కి డ్రైవింగ్ స్కోరును ఇస్తారు. దాని ప్రకారమే ఇన్సూరెన్స్‌ను నిర్ణయిస్తారు.

వాహనాలన్నింటికీ ఒకే ఇన్సూరెన్స్..
ఒకవేళ వాహనందారునికి ఒకటి కంటే అత్యధిక వాహనాలుంటే.. కొత్త రూల్స్ ప్రకారం, అన్ని వాహనాలకు కలిపి ఒకే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. టెలిమాటిక్స్ ఆధారిత మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్లను వాడుతూ కొత్త నిబంధనల కింద ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వెహికిల్స్ ఎన్ని ఉన్నాయనే దాని మీద ప్రీమియం చెల్లింపులు ఆధారపడి ఉంటాయి.

తక్కువ డ్రైవ్ చేస్తే.. తక్కువ ప్రీమియమే..
జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కొత్త ఇన్సూరెన్స్ ప్రొడక్టులకు ఆమోదం తెలిపింది. కొత్త మోటార్ ఇన్సూరెన్స్ నిబంధనల ప్రకారం, వెహికిల్ ప్రయాణించే దూరాన్ని బట్టి కూడా ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించవచ్చు. ఒకవేళ వెహికిల్ తక్కువగా వాడితే.. ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది.

Also read : కార్బోరాండమ్ కాసుల పంట.. అద్భుతంగా రాణిస్తోంది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.