యాప్నగరం

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం.. కేంద్రం కీలక ఆదేశాలు.. బాధితులకు వేగంగా డబ్బులు!

Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురై 280 మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. రైలు ప్రమాద బాధితులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు సూచించింది. దీంతో బాధితులకు ఊరట కలగనుంది. ఐఆర్‌డీఏఐ ఆదేశాల్లోని పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 8 Jun 2023, 11:33 am
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఊరట కలిగించేలా కీలక ఆదేశాలు జారీ చేసింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). బాధితులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇందు కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయినవారు, క్షతగాత్రులుగా మారిన వారిని ఈ కష్టకాలంలో ఆదుకోవాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీలపై ఉందని ఐఆర్‌డీఏఐ (Insurance Regulatory and Development Authority of India) సూచించింది. అర్హులైన వారి బీమా క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేసింది.
Samayam Telugu odisha.


ఈ మేరకు జూన్ 5, 2023 రోజునే ఓ ప్రకటన జారీ చేసింది. 'ప్రస్తుత సమయంలో అర్హత కలిగిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్లు, రిజిస్ట్రేషన్లు వేగంగా నిర్వహిస్తూ ఒడిశా రైలు ప్రమాద బాదితుల్లో బీమా తీసుకున్న వారికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ ఇండస్ట్రీపై ఉంది. అన్ని క్లెయిమ్స్‌ను వేగంగా సెటిల్మెంట్ చేసేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ వివరాలను సమర్పించాలి.' అని ప్రకటనలో తెలిపింది ఐఆర్‌డీఏఐ.

మరోవైపు.. బాధితులకు అండగా నిలిచేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు సీనియర్ ఆఫీర్ పర్యవేక్షణలో అవసరమైన హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరింది ఐఆర్‌డీఏఐ. సీనియర్ అధికారి నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించాలని స్పష్టం చేసింది. అర్హత కలిగిన అన్ని క్లెయిమ్స్‌ (Insurance Claims) సెటిల్మెంట్, ప్రాసెసింగ్, రిసిప్ట్ ప్రక్రియను సమన్వయం చేస్తారని తెలిపింది. నోడల్ అధికారి వివరాలు, హెల్ప్ లైన్ నంబర్ తమ వెబ్‌సైట్ సహా ఇతర మార్గాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. అలాగే బీమా క్లెయిమ్‌ల కోసం ప్రత్యేక క్యాంపులు సైతం ఏర్పాటు చేయాలని కోరింది. ముందుగా క్లెయిమ్ పేమెంట్లు అకౌంట్ల ద్వారా చేసేవి ముందుగా పూర్తి చేయాలన్నది. అలాగే మరణించిన లేదా గాయపడిన వారికి సంబంధించి అధికారులు ఇచ్చిన వివరాలను తీసుకుని తమ పాలసీదారుల్లో ఎవరైనా ఉన్నారా అనేది బీమా కంపెనీ పరిశీలించాలని సూచించింది.

బెంగళూరు్-హౌరా, కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒడిశాలోని బాలాసోర్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1100 మందికిపైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే బాధితులకు అండగా నిలిచేందుకు ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ కంపెనీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.