యాప్నగరం

Tech Mahindra Buyback: టెక్ మహీంద్రా షేర్ల బైబ్యాక్

టెక్ మహీంద్రా షేరు ప్రస్తుత ధరతో పోలిస్తే 14.59 ప్రీమియంతో బైబ్యాక్‌ చేస్తోంది. కంపెనీ బైబ్యాక్‌కు మార్చి 6 రికార్డ్‌ తేదీగా ప్రకటించింది. షేర్ల బైబ్యాక్ ప్రకటన నేపథ్యంలో టెక్‌ మహీంద్రా షేరు ధర మద్యాహ్నం 2 గంటల సమయంలో 2.17 శాతం పెరుగుదలతో రూ.830 వద్ద కొనసాగుతోంది.

Samayam Telugu 21 Feb 2019, 2:16 pm

ప్రధానాంశాలు:

  • 2.05 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ బోర్డు ఆమోదం
  • షేరుకు రూ.950 చొప్పున చెల్లింపు
  • బైబ్యాక్ కోసం రూ.1,956 కోట్లు వెచ్చించనున్న కంపెనీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu tech
టెక్‌ దిగ్గజం టెక్‌ మహీంద్రా బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.1,956 కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు కంపెనీ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. కాగా షేర్ల బైబ్యాక్ ప్రక్రియలో కంపెనీ షేర్‌హోల్డర్ల వద్ద నుంచి షేర్లను కొనుగోలు చేస్తుంది. ఇందులో షేరు మార్కెట్ ధర కన్నా కంపెనీ ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుంది.
ఒక్కొక్క షేరుకు రూ. 950 ధర చొప్పున దాదాపు 2.05 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేస్తామని కంపెనీ వెల్లడించింది. ఇది 2.1 శాతం ఈక్విటీ వాటాకు సమానం. ఇందుకు రూ.1,956 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. అయితే ఈ బైబ్యాక్‌లో కంపెనీ ప్రమోటర్లు పాల్గొంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

టెక్ మహీంద్రా షేరు ప్రస్తుత ధరతో పోలిస్తే 14.59 ప్రీమియంతో బైబ్యాక్‌ చేస్తోంది. కంపెనీ బైబ్యాక్‌కు మార్చి 6 రికార్డ్‌ తేదీగా ప్రకటించింది. షేర్ల బైబ్యాక్ ప్రకటన నేపథ్యంలో టెక్‌ మహీంద్రా షేరు ధర మద్యాహ్నం 2 గంటల సమయంలో 2.17 శాతం పెరుగుదలతో రూ.830 వద్ద కొనసాగుతోంది.

కాగా గత నెలలో ఇన్ఫోసిస్ కూడా రూ.8,260 కోట్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. అలాగే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా రూ.225 కోట్ల బైబ్యాక్ ప్రణాళికలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.