యాప్నగరం

Jeff Bezos: ప్రియురాలితో జెఫ్ బెజోస్ వివాహం.. గ్రాండ్‌గా నిశ్చితార్థం.. 20 క్యారెట్ల డైమండ్ రింగ్ ఇచ్చి..!

Jeff Bezos: Jeff Bezos: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫో బెజోస్.. తన ప్రేయసి లారెన్ సాంచెజ్‌ను అతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ఇరువురూ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 24 May 2023, 10:06 am
Jeff Bezos: Jeff Bezos: అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ తన ప్రేయసి.. లారెన్ సాంచెజ్‌తో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు పలు కథనాలను ప్రచురించాయి. తన మొదటి భార్య మెకంజీ స్కాట్‌కు విడాకులు ఇచ్చినప్పటి నుంచి బెజోస్.. ఈ సాంచెజ్‌తోనే డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతోనే వీరిరువురూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక లారెన్ ఇటీవల హృదయాకారంలో ఉన్న ఉంగరం ధరించడం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఉంగరం 20 క్యారెట్ల డైమండ్లతో పొదిగి ఉన్నట్లు తెలిసింది.
Samayam Telugu Jeff Bezos


ఇక లారెన్ విషయానికి వస్తే.. ఈమె గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పలు దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్ సాంచెజ్ .. 2018 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019 వరకు ఈ విషయం అసలు ఎక్కడా బయటికి రాలేదు. బెజోస్.. తన మాజీ భార్య మెకంజీ స్కాట్‌తో 2018లోనే విడాకులు తీసుకున్నారు. దీంతో 25 ఏళ్ల వివాహ బంధానికి అప్పట్లో స్వస్తి పలికారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ డివోర్స్ ప్రక్రియ పూర్తయ్యేవరకు.. లారెన్, బెజోస్ తమ మధ్య సంబంధాన్ని బయటికి అధికారికంగా వెల్లడించలేదు.

Rs 2000 Notes: రూ. 2 వేల నోటు ఉపసంహరణ వల్ల కలిగే లాభాలివే.. కేంద్రం అసలు స్కెచ్ అదేనా?

Hyderabad: ఏడాదిలో ఏకంగా 5.58 లక్షల ఇళ్లు.. ఈ నగరాల్లోనే తెగ డిమాండ్.. హైదరాబాద్‌ పరిస్థితేంటి?

బెజోస్.. మెకంజీకి 38 బిలియన్ డాలర్లు భరణంగా చెల్లించారు. దీంట్లో సగం వరకు దాతృత్వ కార్యక్రమాల కోసమే ఆమె వినియోగించారు. లారెన్ సాంచెజ్‌కు అంతకుముందు పాట్రిక్ వైట్‌సెల్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ NFL ఆటగాడు.. టోనీ గొంజాలెజ్‌తో కూడా ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది.

CIBIL Score: మీకు తెలియకుండానే సిబిల్ స్కోరు తగ్గుతుందా? కారణాలివే కావొచ్చు.. ఇలా పెంచుకోవచ్చు..

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.