యాప్నగరం

ప్రపంచ సంపన్నుడు బెజోస్.. ఒక్క పూటకే!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అవతరించారు. కానీ ఆ స్థానం ఎంతసేపో నిలవలేదు.

TNN 28 Jul 2017, 1:08 pm
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అవతరించారు. కానీ ఆ స్థానం ఎంతసేపో నిలవలేదు. గురువారం ఉదయం అమెజాన్ షేరు 1.8 శాతం లాభపడి 1065.92 డాలర్లు చేరింది. ఫలితంగా అమెజాన్‌లో 17 శాతం వాటా కలిగిన జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 90.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (90.7 బిలియన్ డాలర్లు)‌ను దాటేసి బెజోస్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే బెజోస్ ఆనందం ఎంతసేపో నిలవలేదు. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి అమెజాన్ షేర్ విలువ 0.7 శాతానికి పడిపోయింది. దీంతో బెజోస్ సంపద ఒక్కసారిగా 89.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
Samayam Telugu jeff bezos reign as the worlds richest person was short lived
ప్రపంచ సంపన్నుడు బెజోస్.. ఒక్క పూటకే!


అయితే ప్రపంచ సంపన్నుడిగా బెజోస్ అవతరించారంటూ పత్రికల్లో, టీవీల్లో ప్రచారం జరిగింది. కానీ అది ఒక్కపూట మాత్రమే. కేవలం నాలుగైదు గంటలపాటు ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా బెజోస్ నిలిచారు. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బెజోస్ కొన్ని గంటలపాటు అత్యంత సంపన్నుడిగా ఉండి మళ్లీ కిందకి పడిపోయారు. కాగా, 2013 నుంచి 2013 మే నుంచి బ్లూంబర్గ్‌ బిలియనీర్ల జాబితాలో బిల్‌గేట్స్‌దే అగ్రస్థానం. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని బెజోస్ కొన్ని గంటలపాటు సొంతం చేసుకుని మళ్లీ బిల్‌గేట్స్‌కే ఇచ్చేశారు.

తాజా జాబితాలో బిల్‌గేట్స్ 90.7 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఇక 89.3 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలిచారు. స్పానిష్ వ్యాపారవేత్త అమన్సియో ఓర్టేగా మూడో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 82.7 బిలియన్ డాలర్లు. 74.5 బిలియన్‌ డాలర్ల సంపదతో బెర్క్‌షైర్‌ హథ్‌‌వే ఛైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ నాలుగో స్థానంలో నిలిచారు. ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌.. 72.5 బిలియన్ డాలర్ల సంపాదనతో ఐదో స్థానానికి చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.