యాప్నగరం

జియో ఎక్స్ఛేంజ్ ఆఫర్.. చౌకగా 4జీ రౌటర్

​ ఉచిత ఆఫర్లతో హోరెత్తిస్తూ.. టెలీకాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో... జియోఫైతోనూ మార్కెట్లో పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది

TNN 6 May 2017, 5:33 pm
ఉచిత ఆఫర్లతో హోరెత్తిస్తూ.. టెలీకాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో... జియోఫైతోనూ మార్కెట్లో పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. వరుస ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలను నేలకు దింపిన అంబానీ సంస్థ.. పాత డేటా కార్డులు లేదా రౌటర్లు ఇచ్చి జియోఫై 4జీ రౌటర్ పట్టుకుపోమంటోంది. ఇందుకోసం రెండు ప్లాన్లను ప్రకటించింది. మొదటి ప్లాన్ ప్రకారం జియో డిజిటల్ స్టోర్ లేదా జియో కేర్ స్టోర్‌కు వెళ్లి.. పాత డేటా కార్డు, డోంగిల్ లేదా హాట్‌స్పాట్ రౌటర్‌ను ఇచ్చేస్తే.. రూ.2010 విలువైన 4జీ డేటాను జియో ఉచితంగా అందిస్తుంది.
Samayam Telugu jio exchange offer deposit old data card dongle to get 4g router
జియో ఎక్స్ఛేంజ్ ఆఫర్.. చౌకగా 4జీ రౌటర్


జియోఫై రౌటర్‌ కోసం కస్టమర్లు రూ. 1999 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత తొలి రీఛార్జ్‌గా రూ.408 చెల్లించి 84 రోజులపాటు డేటాను ఉచితంగా పొందొచ్చు. ఇందులో రూ.99 జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ఆఫర్ కాగా, రూ.309 డేటా ప్లాన్. అంటే కస్టమర్లు రూ. 1999 చెల్లిస్తే.. అంతకు రూ.11 ఎక్కువ విలువైన డేటాను సంస్థ అందిస్తుంది. ఓవరాల్‌గా. రూ. 419 ఖర్చుతో జియోఫై రౌటర్ పొందడమే కాకుండా డేటాను కూడా 84 రోజులపాటు ఫ్రీగా పొందొచ్చు.

ఇక రెండో ప్లాన్‌లో యూజర్లు డేటా కార్డులను ఎక్స్ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరమేం లేదు. రూ. 1999తో జియోఫైను కొనుగోలు చేసి రూ.408తో రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రూ. 1005 విలువైన 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. అంటే రూ.994కే జియోఫై మీ సొంతం అవుతుందన్నమాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.