యాప్నగరం

జియో ప్రైమ్‌లో చేరినా.. ఇలా చేయకపోతే?

రూ.99తో ప్రైమ్ మెంబర్‌గా చేరితే తక్కువ ధరకే డేటాను పొందే వీలుంది. ఒకవేళ ప్రైమ్ మెంబర్‌గా చేరకపోతే ఏమవుతుందో చూద్దాం..

TNN 25 Mar 2017, 5:38 pm
మార్చి 31తో జియో ప్రైమ్ తుది గడువు ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి జియో కస్టమర్లు నెలవారీ రీచార్జ్ చేసుకుంటేనే జియో ఆఫర్లను పొందడానికి వీలవుతుంది. సెప్టెంబర్ 5న మార్కెట్లోకి లాంచ్ చేసింది మొదలు.. ఇప్పటి వరకూ ఉచితంగా డేటా, కాల్స్ సర్వీస్‌లను అందించిన జియో ఇక నుంచి డబ్బులు వసూలు చేయనుంది. రూ.99తో ప్రైమ్ మెంబర్‌గా చేరితే తక్కువ ధరకే డేటాను పొందే వీలుంది. రూ. 303తో రీచార్జ్ చేసుకుంటే నెలపాటు రోజుకు 1 జీబీ చొప్పున డేటా పొందవచ్చు. ఒకవేళ ప్రైమ్ మెంబర్‌గా చేరకపోతే ఏమవుతుందో చూద్దాం..
Samayam Telugu jio prime offer here is what will happen to jio sim if you are not a prime member
జియో ప్రైమ్‌లో చేరినా.. ఇలా చేయకపోతే?


మార్చి 31లోగా జియో సిమ్ తీసుకునే వారు ప్రైమ్ మెంబర్లుగా చేరే వీలుంది. ముకేశ్ అంబానీ చెప్పినట్లుగా.. జియో వాయిస్ కాల్స్‌ను లైఫ్ టైం ఉచితంగా పొందొచ్చని అనుకుంటున్నారా. మార్చి 31 వరకే అది పరిమితం. ఆ తర్వాత రీచార్జ్ చేయించకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కాకుండా.. ఇన్ కమింగ్ కాల్స్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది.

మార్చి 31 తర్వాత ఏదో ఒక ప్లాన్ ఎంపిక చేసుకోకపోతే మీ సిమ్‌కు సేవలు ఆగిపోయే అవకాశం కూడా ఉంది. జియో నిబంధనల ప్రకారం.. రిచార్జీ వ్యాలిడిటీ ముగిశాక.. 90 రోజులపాటు ఎలాంటి రిచార్జ్ చేయకపోతే మీ సిమ్ డిస్‌కనెక్ట్ అవుతుంది.

మార్చి 31లోగా జియో ప్రైమ్ మెంబర్‌గా చేరకపోవడంతోపాటు ఏ ప్లాన్‌ను కూడా ఎంపిక చేసుకోకపోతే ట్రాయ్ నిర్దేశాలకు అనుగుణంగా జియో మీ నంబర్‌ను డిస్‌కనెక్ట్ చేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.