యాప్నగరం

ఐటీ రిటర్న్స్‌కు చివరితేది జులై 31

2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జులై 31 తో గడువు ముగిసిపోనుంది.

TNN 17 Jul 2017, 6:29 pm
2016-17 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఆదాయ‌ప‌న్ను రిట‌ర్న్ దాఖలు చేయడానికి జులై 31 చివ‌రి తేది. అంత‌కంటే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు సమయంలో ఫారం 16తో పాటు ఫారం 26ఏఎస్ ఆవశ్య‌క‌త కూడా తెలుసుకోవాలి. ఫారం 16ను పనిచేసే సంస్థలు అందజేస్తాయి. ఇది జీతంలో టీడీఎస్ (ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్‌) మిన‌హాయించిన‌ట్లు కంపెనీ ధ్రువీకరించే ప‌త్రం. కానీ ఫారం 26ఏఎస్ మాత్రం అన్ని ర‌కాల ప‌న్నులను చెల్లించిన‌ట్లు మీరే స్వ‌యంగా ధ్రువీక‌రించుకొని జారీ చేసే ప‌త్రం. దీన్ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
Samayam Telugu july 31 is last date for filing tax return why form 26as has to be checked
ఐటీ రిటర్న్స్‌కు చివరితేది జులై 31


ఈ రెండు పత్రాలతో ఆదాయపు ప‌న్ను రిటర్న్స్ దాఖ‌లు చేసేముందు ఒకసారి వాటిలో లెక్క‌లు స‌రిపోయాయో లేదో చూసుకోండి. రెండింటికీ పొంతన లేకపోతే త‌ర్వాత స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీలైతే కంపెనీ స‌హాయం తీసుకుని మీ టీడీఎస్ వివ‌రాల‌ను స‌రిపోల్చుకోవాలి.
ఒక వ్యక్తి జీతం, ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ, తదితరాల నుంచి టీడీఎస్‌ను తీసివేసిన తర్వాత క్రెడిట్‌ను నిర్ధారించడానికి ఫారం 26 ఏఎస్ చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా ఆదాయంలో రాబడి, టీడీఎస్‌ కోతల్లో కొరతఇందులో ప్రతిఫలిస్తాయి. కాబట్టి ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత దఖలుచేయాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.