యాప్నగరం

రూ.లక్షకు రూ.767 ఈఎంఐ.. అదిరే ఫైనాన్స్ స్కీమ్స్!

కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారికి తీపికబురు. కియా మోటార్స్ పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తక్కువ ఈఎంఐ ఫెసిలిటీ అందిస్తోంది. మూడు కార్లకు ఆఫర్ వర్తిస్తుంది.

Samayam Telugu 3 Aug 2021, 8:59 am

ప్రధానాంశాలు:

  • అదిరిపోయే స్కీమ్స్
  • తక్కువ ఈఎంఐ
  • రూ.లక్షకు రూ.767 ఈఎంఐ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu car offers
కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా తన కస్టమర్ల కోసం పలు బ్యాంకులతో జతకట్టింది. కొనుగోలుదారుల కోసం ఆకర్షణీయ స్కీమ్స్ అందిస్తోంది.
కియా మోటార్స్ తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌లతో జతకట్టింది. ఇందులో భాగంగా కియా కారు కొనుగోలు చేసే వారి కోసం ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. కస్టమైజ్డ్ ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా కస్టమర్లు సులభంగానే రుణం పొందొచ్చని కంపెనీ తెలిపింది.

Also Read: undefined

కస్టమర్లు కియా సెల్టోస్, కియా సొనెట్, కియా కార్నివాల్ కార్లను సులభ ఈఎంఐ స్కీమ్స్ కింద కొనుగోలు చేయొచ్చు. కియా సెల్టోస్, కియా సొనెట్ కార్లను తక్కువ ఈఎంఐతో కొనొచ్చు. రూ.లక్షకు రూ.767 నుంచి ఈఎంఐ ప్రారంభమౌతోంది. ఈ బెనిఫిట్ తొలి ఆరు నెలలకే వర్తిస్తుంది. తర్వాత రెగ్యులర్ ఈఎంఐ కట్టాలి.

కియా కార్నివాల్ కారు కొనుగోలు చేస్తే తొలి ఆరు నెలలు రూ.13,999 ఈఎంఐ చెల్లించాలి. తర్వాత రెగ్యులర్ ఈఎంఐ కట్టాలి. ఐదేళ్ల కాల పరిమితితో లోన్ సౌకర్యం పొందొచ్చు. కారు ఎక్స్‌షోరూమ్ ధరకు సమానమైన మొత్తాన్ని లోన్ రూపంలో లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.