యాప్నగరం

Fixed Deposit Rates: డిపాజిట్‌దారులకు తీపికబురు అందించిన ప్రముఖ బ్యాంక్.. కీలక నిర్ణయం!

Bank FD Rates : బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. బ్యాంకులు వరుస పెట్టి వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పుడు మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ కూడా ఇదే దారిలో నడిచింది. వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇకపై అధిక వడ్డీ వస్తుంది. కొత్త ఎఫ్‌డీలకు, రెన్యూవల్ చేసుకునే డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.

Authored byKhalimastan | Samayam Telugu 11 Aug 2022, 9:25 am

ప్రధానాంశాలు:

  • వడ్డీ రేట్లు పెంచేసిన మరో ప్రైవేట్ బ్యాంక్
  • కస్టమర్లకు గతంలో కన్నా ఇకపై ఎక్కువ వడ్డీ
  • ఇప్పటికే అమలులోకి వచ్చిన కొత్త రేట్లు
  • ఏ ఏ టెన్యూర్‌పై ఎంత వడ్డీ ఉందో తెలుసుకోండి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu banks
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్
Latest FD Rates: బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకులు వరుస పెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా మరో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఇదే దారిలో నడిచింది. ఎఫ్‌డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీని వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే కస్టమర్లకు ఊరట కలుగనుంది. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి వస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఆగస్ట్ 10 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్లకు లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. బ్యాంక్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తోంది. ఈ ఎఫ్‌డీలపై 2.5 శాతం నుంచి 5.9 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే ఎక్కువ వడ్డీ వస్తుంది. వీరికి 3 శాతం నుంచి 6.4 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది.

Also Read: undefined

7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీ రేటు ఉంది. 15 రోజుల నుంచి 30 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే 2.65 శాతం వడ్డీ వస్తోంది. ఇదివరకు వడ్డీ రేటు 2.5 శాతంగా ఉండేది. 31 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అయితే వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంది. ఇది వరకు వడ్డీ రేటు 3 శాతంగా ఉంది. అంటే 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు.

అలాగే 91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 3.75 శాతంగా ఉంది. ఇది వరకు వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది. అంటే ఇక్కడ కూడా వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. ఇంకా 180 రోజుల నుంచి 363 రోజుల ఫిక్స్‌డ్ డిపాజట్లపై అయితే బ్యాంక్ 5 శాతం వడ్డీని అందిస్తోంది. ఇది వరకు వడ్డీ రేటు 4.75 శాతంగా ఉండేది. ఇంకా 364 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.25 శాతంగా కొనసాగుతోంది. 365 రోజుల నుంచి 390 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.