యాప్నగరం

కోటక్ బ్యాంక్‌ కీలక నిర్ణయం.. డబ్బులు దాచుకునే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలివే!

కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. మార్చి 25 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. దీంతో బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేసే వారు ఈ విషయాలు తెలుసుకోవాలి.

Samayam Telugu 30 Mar 2021, 10:03 am

ప్రధానాంశాలు:

  • బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్
  • కోటక్ కీలక నిర్ణయం
  • కస్టమర్లు తెలుసుకోవాల్సిన అంశాలివే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kotak bank
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీంతో ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఎఫ్‌డీలపై ఎంత వడ్డీ వస్తోందో గమనించాలి.
7 రోజుల నుంచి 30 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీ వస్తోంది. 31 రోజుల నుంచి 90 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. 91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 3.25 శాతం వడ్డీ వస్తుంది. 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు.

Also Read: undefined

ఏడాది నుంచి 389 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీ లభిస్తుంది. 390 రోజుల నుంచి 23 నెలల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ పొందొచ్చు. 23 నెలల నుంచి 3 ఏళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ వస్తుంది. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.1 శాతం వడ్డీని పొందొచ్చు.

4 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.3 శాతం వడ్డీని పొందొచ్చు. మార్చి 25 నుంచి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అదేసమయంలో సీనియర్ సిటిజన్స్ 50 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీని పొందే ఛాన్స్ ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.