యాప్నగరం

లెనొవొ స్మార్ట్‌ఫోన్ ధరల తగ్గింపు

ప్రముఖ చైనా కంపెనీ లెనొవొ స్మార్ట్‌ఫోన్ ధరలు భారత్‌లో తగ్గాయి. ఈ మేరకు దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. లెనొవొ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది.

TNN 4 Jul 2017, 1:30 pm
ప్రముఖ చైనా కంపెనీ లెనొవొ స్మార్ట్‌ఫోన్ ధరలు భారత్‌లో తగ్గాయి. ఈ మేరకు దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. లెనొవొ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. డిస్కౌంట్ ధరలతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. లెనొవొ స్మార్ట్‌ఫోన్లలో పి2పై అత్యధికంగా రూ. 3,500 తగ్గించింది. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన లెనొవొ పి2 ధర రూ. 16,999. ఇప్పుడు ఈ ఫోన్ రూ. 13,499కే లభిస్తోంది. 3జీబీ, 4జీబీ ర్యామ్.. రెండు మోడళ్లపై ధరలను తగ్గించింది.
Samayam Telugu lenovo smartphones get a price cut in india
లెనొవొ స్మార్ట్‌ఫోన్ ధరల తగ్గింపు


ఇక లెనొవొ కె5 నోట్‌ (32జీబీ)పై రూ. 3000 తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడిది రూ. 9,499కే అందుబాటులోకి వచ్చింది. లెనొవొ కె6 పవర్‌పై రూ. 500, కె5 నోట్ (64)జీబీపై రూ. 1000, లెనొవొ వైబ్ కె5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అలాగే ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై కూడా ప్లిప్‌కార్ట్ భారీ ఫ్లాట్ డిస్కౌంట్లన ప్రకటించింది.

ఆనర్ 6 ప్లస్ (32జీబీ) ఫోన్‌ ధరను రూ. 13,500 తగ్గించింది. దీంతో ఈ ఫోన్ రూ. 26,499కే లభిస్తోంది. ఎంఐ 5పై రూ. 2000, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్‌పై రూ. 13వేలు, అసుస్ జెన్‌ఫోన్ జూమ్ రూ. 15వేల, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ఎస్‌పై రూ. 4వేలు, సామ్సంగ్ జె5 ప్రైమ్‌పై రూ. 2వేలు డిస్కౌంట్‌ను అందిస్తోంది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ తరవాత ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఈ భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.