యాప్నగరం

LIC Housing Finance: ఇంటి రుణాలు తీసుకునే వారిపై బాదుడు, వడ్డీ రేట్లు పెంచి ఝలకిచ్చిన ఎల్‌ఐసీ హౌసింగ్

LIC Housing Finance: ఆర్‌బీఐ పాలసీ ప్రకటనకు ముందే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఇంటి రుణాలు తీసుకునే వారికి ఝలకిచ్చింది. వడ్డీ రేట్లను మళ్లీ పెంచేసింది. గత నెలలో 15.80 శాతంగా ఉన్న ఎల్ఐసీ హౌసింగ్ ప్రైమ్ లెండింగ్ రేటును ప్రస్తుతం 15.95 శాతానికి పెంచింది. దీంతో ఇంటి రుణాలు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరును బట్టి ఎల్ఐసీ హౌసింగ్ హోమ్ లోన్ రేట్లు ఆధారపడి ఉన్నాయి. ఎంత క్రెడిట్ స్కోరు ఉంటే ఎంత వడ్డీ రేటును ఈ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ విధిస్తుందో చూద్దాం..

Authored byKoteru Sravani | Samayam Telugu 23 Sep 2022, 5:01 pm

ప్రధానాంశాలు:

  • వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెంచిన ఎల్ఐసీ హౌసింగ్
  • ప్రైమ్ లెండింగ్ రేటు 15.95 శాతానికి పెంపు
  • కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 20, 2022 నుంచే అమల్లోకి
  • క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లలో మార్పులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu LIC Housing Finance
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
‌LIC Housing Finance: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(LIC HFL) తన బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును సమీక్షించింది. ఇంటి రుణాలను నిర్ణయించే బెంచ్ మార్కు ప్రైమ్ లెండింగ్ రేటును సమీక్షించినట్టు ఎల్ఐసీ హౌసింగ్ ప్రకటించింది. ఇంటి రుణాలపై ఈ సమీక్షించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 20, 2022 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్ఐసీ హౌసింగ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచి 15.95 శాతానికి తీసుకొచ్చినట్టు తెలిసింది.
ఎల్ఐసీ హౌసింగ్ వెబ్‌సైట్‌ ప్రకారం.. క్రెడిట్ స్కోరు 800 లేదా దానికి పైన ఉంటే.. రూ.15 కోట్ల వరకు తీసుకునే రుణాలకు వేతన జీవులకు వడ్డీ రేట్లు 8 శాతం నుంచి ప్రారంభమవుతాయి. అలాగే 750 నుంచి 799 మధ్యలో క్రెడిట్ స్కోరు ఉన్న వేతన జీవులు, వృత్తిపరమైన రుణ గ్రహీతలు రూ.5 కోట్ల వరకు తీసుకునే రుణాలపై 8.05 శాతం వడ్డీని చెల్లించాలి. అలాగే రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు తీసుకునే రుణాలపై 8.40 శాతం వడ్డీ విధిస్తుంది. సిబిల్ స్కోరు 700 నుంచి 749 మధ్యలో ఉంటే.. రూ.50 లక్షల రుణానికి 8.20 శాతం వడ్డీని, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లకు తీసుకునే రుణానికి 8.40 శాతం వడ్డీ రేటుని ఎల్ఐసీ హౌసింగ్ విధిస్తుంది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ, రూ.15 కోట్ల వరకు తీసుకునే రుణాలపై ఎల్ఐసీ హౌసింగ్ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. జాయింట్ అప్లికెంట్ల విషయంలో.. అభ్యర్థుల సిబిల్ స్కోరును చెక్ చేస్తామని, వారిలో అత్యధిక స్కోరు ఎవరికుంటే, వారిదే పరిగణనలోకి తీసుకుంటామని ఎల్ఐసీ హౌసింగ్ చెప్పింది.

ఎల్ఐసీ హౌసింగ్‌ నుంచి ఇంటి రుణం పొందాంటే కావాల్సిన కేవైసీ, ఇన్‌కమ్ డాక్యుమెంట్లు..
పాన్ కార్డు
ఆధార్ కార్డు
ఎన్‌ఆర్ఐలు అయితే పాస్‌పోర్టు అవసరం
నివాస ధ్రువీకరణ
వేతన స్లిప్‌లు, వేతన జీవులకైతే ఫామ్ 16
చివరి 6 నుంచి 12 నెలలకు చెందిన బ్యాంకు స్టేట్‌మెంట్లు
మూడు సంవత్సరాలకు చెందిన ఆదాయపు పన్ను రిటర్నులు

Also Read : పండగ షాపింగ్ చేసే వారికి శుభవార్త.. ఐసీఐసీఐ బ్యాంకు అదిరిపోయే ఆఫర్లు!

కావాల్సిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు..
ప్రాపర్టీ ఓనర్‌షిప్‌కి చెందిన ప్రూఫ్
ఫ్లాట్స్ అయితే.. బిల్డర్ లేదా సొసైటీ ఇచ్చిన అలాట్‌మెంట్ లెటర్
ట్యాక్స్ చెల్లింపు రశీదులు

ప్రాసెసింగ్ ఫీజులు ఎలా ఉన్నాయి..?

  • రూ.2 కోట్ల వరకు రుణాలకు..
CIBIL >= 725 ఉంటే లోన్ మొత్తంపై 0.25 శాతం, గరిష్టంగా రూ.20 వేలు ప్లస్ జీఎస్టీ
CIBIL < 725గా ఉంటే లోన్ మొత్తంపై 0.30 శాతం, గరిష్టంగా రూ.24 వేలు ప్లస్ జీఎస్టీ

  • రూ. 2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకున్న రుణాలకు..
CIBIL >= 725 అయితే రూ.50 వేల ప్లస్ జీఎస్టీ
CIBIL < 725 అయితే రూ.60 వేలు ప్లస్ జీఎస్టీ


Also Read : కేవలం 10 రోజులే బ్యాంకులు ఓపెన్.. 21 రోజులు మూతే, అక్టోబర్‌ నెలలో బ్యాంకు సెలవులివే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.