యాప్నగరం

ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి!

గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్న వారికి ఝలక్. గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వినియోగదారులపై నేరుగా ప్రభావం పడనుంది.

Samayam Telugu 1 Jun 2020, 9:05 am
మధ్యతరగతి ప్రజలకు ఒకటో తేదీ షాక్. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. గ్యాస్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సిలిండర్ ధర రూ.100కు పైగా పైకి కదిలింది. దీంతో సిలిండర్ వినియోగదారులపై ప్రభావం పడనుంది. జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.
Samayam Telugu GAS price


సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.11.5 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కు చేరింది. అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.110 ఎగసింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కు ఎగసింది. ఢిల్లీలో ఈ రేట్లు వర్తిస్తాయి. ఇక మే నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.744 నుంచి రూ.581కు తగ్గిన విషయం తెలిసిందే.

Also Read: undefined

ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర (14.2 కేజీలు) రూ.581 నుంచి రూ.593కు చేరింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.616కు, ముంబైలో సిలిండర్ ధర రూ.590కు, చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.606కు ఎగసింది. అన్ని రాష్ట్రాల్లోనూ 19 కేజీల సిలిండర్ ధర కూడా పెరిగింది.

Also Read: undefined

కాగా కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి కుబుంబానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు వర్తిస్తుంది. ఏడాదిలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ మొత్తం రాదు. సిలిండర్ ధర ఎంత ఉందో అంతే చెల్లించాలి.

ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ధర తగ్గొచ్చు. పెరగొచ్చు. లేదంటే అలాగే కూడా ఉండొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.