యాప్నగరం

బంపరాఫర్.. కారు కొంటే ఏకంగా రూ.3 లక్షలకు పైగా తగ్గింపు!

కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఏకంగా రూ.3 లక్షలకు పైగా తగ్గింపు లభిస్తోంది. కార్ల తయారీ కంపెనీ మహీంద్రా ఈ అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది.

Samayam Telugu 17 Nov 2020, 1:26 pm

ప్రధానాంశాలు:

  • కార్లపై అఫర్లు
  • రూ.3 లక్షల వరకు తగ్గింపు
  • కస్టమర్లకు బెనిఫిట్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu mahindra offer
కొత్తగా కారు కొనుగోలు చేయాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కొత్తగా కారు కొనుగోలు చేస్తే ఏకంగా రూ.3 లక్షలకు పైగా తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా తన కార్లపై అదిరే ఆఫర్లు అందిస్తోంది.
క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీ యాక్ససిరీస్ వంటి ప్రయోజనాలు కల్పిస్తోంది. మహీంద్రా అల్టురస్ జీ4, ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అల్టురస్ జీ4 కారుపై రూ.2.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.50,000 తగ్గింపు లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.16,000 తగ్గింపు ఉంది. ఇక రూ.20 వేల విలువైన యాక్ససిరీస్ పొందొచ్చు.

Also Read: undefined

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారుపై రూ.57,000 డిస్కౌంట్ ఉంది. మహీంద్రా స్కార్పియో కారుపై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.25,000 బెనిఫిట్ లభిస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 ఉంది. రూ.10 వేల విలువైన యాక్సిసిరీస్ పొందొచ్చు.

అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారుపై కూడా తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కారుపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. రూ.25,000 ఎక్స్చేంజ్ బోనస్ సొంతం చేసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 లభిస్తుంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.