యాప్నగరం

Mansa Musa: ప్రపంచంలో సగం Gold ఇతని దగ్గరే.. అపార సంపద.. ఎంత తిన్నా తరగని ఆస్తి!

Mansa Musa Gold: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి గురించి మీకు తెలుసా.. మస్క్, Adani, అంబానీనో కాదు.. ఇది వేరే కథ. తెలియకపోతే ఇది చూడండి. అప్పట్లో ఒకడుండేవాడు అంటే అది ఇతని గురించే. చరిత్రలోనే ఇప్పటివరకు అత్యంత ధనవంతుడు (Worlds Richest Person) మాన్సా ముసా. లెక్కపెట్టలేనంత సంపద అతడి సొంతం. ప్రపంచంలోని సగం Gold అతని దగ్గరే. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 22 Mar 2023, 6:38 pm
Mansa Musa Gold: ప్రపంచంలో అత్యంత ధనవంతుడు (Worlds Richest Person) ఎవరంటే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు.. Elon Musk, Jeff Bezos, Bill Gates,Gautam Adani, Birla.. ఇలాంటి పేర్లు మన కళ్ల ముందు కదలాడుతాయి. అయితే వీరెవరూ కాదు. చరిత్రలో వీరికంటే ముందు అపార సంపద ఉన్న వారు ఎందరో ఉన్నారు. భూమ్మీద జన్మించిన వారిలో అత్యంత సంపద కలిగిన వ్యక్తి మాన్సా ముసా. అతడి సంపద ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేకపోయినా.. అది అపారం. అనంతం. అని చరిత్రకారులు చెబుతుంటారు. టింబుక్తు అనే సామ్రాజ్యానికి చక్రవర్తి. ఇది పశ్చిమ ఆఫ్రికాలోని ప్రస్తుత Mali దేశంలో ఉండేది. వెలకట్టలేనంత సంపద అతడి దగ్గర ఉండేదట. ఇది ఈ మస్క్, అదానీ , బిల్‌గేట్స్, బెజోస్ సంపద కలిపినా అంతకుమించి ఉంటుందంట. అతడి గురించి, అతడి విశేషాల గురించి చూద్దాం.
Samayam Telugu Mansa musa richest man ever


ముసాకు అంత సంపద ఉండటానికి కారణం అక్కడ బంగారు నిక్షేపాలు ఎక్కువగా ఉండటమే. ప్రపంచం మొత్తం ఉన్న బంగారంలో సగం ముసా దగ్గరే ఉండేదని చెప్పుకుంటారు. అయితే అతని దాతృత్వం కారణంగా ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఏం మిగలలేదు. దీంతో ఇప్పుడు ఆ మాలి పేదదేశంగా మారిపోయింది. తన హయాంలో మాలిలో ఏకంగా 1000 కిలోలకుపైగా బంగారం ఉత్పత్తి అయిందని చెప్పుకుంటారు.

Flipkart బ్యాడ్‌న్యూస్.. వేలాది మంది ఉద్యోగులపై ఎఫెక్ట్.. ఏడాదంతా అలా చేయాల్సిందే పాపం! 'భారత్ నాకు భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది'.. India ను మెచ్చుకుంటూ Bill Gates ప్రశంసల వర్షం..

మాన్సా ముసా అసలు పేరు ముసా కీటా I. చక్రవర్తిగా అవతరించిన తర్వాత మాన్సాగా పేరు మార్చారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం ఉన్న మౌరిటానియా, సెనెగల్, గాంబియా, గైనియా, బుర్కినా ఫాసో, మాలి, నైగర్, చాడ్, నైజీరియా ఇలా ఈ దేశాలన్నీ అప్పట్లో మాన్సా పాలించిన రాజ్యంలో భాగమే. 1312 సంవత్సరంలో మాలి రాజ్యానికి చక్రవర్తిగా అవతరించాడు మాన్సా ముసా. తన 25 ఏళ్ల పాలనలో ఎన్నో మసీదుల్ని నిర్మించాడు. ఇవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.

1280లో మాన్సా ముసా జన్మించగా.. అతడి పెద్ద సోదరుడు మాన్సా అబు బాకర్ 1312 వరకు పాలించారు. తర్వాత ఆ రాజ్యం మాన్సా ముసా చేతుల్లోకి వెళ్లింది. మాన్సా హయాంలో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి మంచి డిమాండ్ ఉండేది. ఇక బంగారు నిల్వలన్నీ ఎక్కువగా మాన్సా దగ్గరే ఉండేవి. చరిత్రకారుల ప్రకారం.. మాన్సా ఆ రోజుల్లో 400 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగి ఉండేవారని తెలుస్తోంది. ఇది భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.30 లక్షల కోట్లకుపైనే కావడం విశేషం. ప్రస్తుత ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ కుటుంబ సంపద 200 బిలియన్ డాలర్లకుపైగా ఉంది.

Zomato Everyday: జొమాటో నుంచి ఇంటి భోజనం.. కొత్త సర్వీసులు షురూ.. రూ.89కే నోరూరించే విందు! Hindenburg అంచనానే నిజమవుతోందా? నెలలో 85 శాతం పడిపోయిన Adani Group షేర్లు.. మరింత కిందికే!

మాన్సా ముసా మక్కా యాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆ సమయంలో పెద్ద పరివారంతో బయలుదేరడం చరిత్రకెక్కింది. ఆయన వెంట ఏకంగా 60 వేల మందిని వెంటబెట్టుకొని వెళ్లారు. ఇందులో 12 వేల మంది తన వ్యక్తిగత అనుచరులు. ఇందులో 500 మంది పట్టువస్త్రాలు ధరించి.. బంగారు రాడ్లను చేతపట్టుకొని ముసా గుర్రం వెంట నడుచుకుంటూ వెళ్లారట. తన సైన్యంలో మక్కా యాత్రకు బయలుదేరినప్పుడు 80 ఒంటెలు కూడా అందులో ఉన్నాయట. ఆ ఒంటెలు ఇంకా 130 కిలోలకుపైగా బంగారాన్ని మోసుకుంటూ ముసా వెంట నడిచాయట.

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.