యాప్నగరం

Maruti శుభవార్త.. కారు కొనే వారికి సులభంగానే రుణం.. ఇంట్లో నుంచే అప్లై చేసుకోండిలా!

మీరు కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం మారుతీ సులభంగానే రుణాలు అందిస్తోంది. పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకొని కార్ లోన్స్ ఆఫర్ చేస్తోంది.

Samayam Telugu 10 Jul 2021, 8:33 am

ప్రధానాంశాలు:

  • కారు కొనే వారికి తీపికబురు
  • సులభంగానే రుణాలు
  • మారుతీ సర్వీసుల విస్తరణ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu car loan
మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా కారు కొనుగోలుదారులకు తీపికబురు అందించింది. సులభంగానే రుణం అందేలా మారుతీ ఫైనాన్స్ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది.
మారుతీ సుజుకీ 20200 డిసెంబర్ నెలలోనే ఫైనాన్స్ సర్వీసులు అందుబాటులోకి తీసుకవచ్చింది. అయితే ఈ సేవలు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఫైనాన్స్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి.

Also Read: undefined

మారుతీ సుజుకీ స్మార్ట్ ఫైనాన్స్ సేవల్లో భాగంగా కారు కొనాలని భావించే వారు ఆన్‌లైన్‌లోనే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎరీనా, నెక్సా డీలర్‌షిప్స్‌లలో మీకు నచ్చిన కారును ఫైనాన్స్ స్కీమ్ కింద కొనుగోలు చేయొచ్చు.

ప్రస్తుతం మారుతీ సుజుకీ స్మార్ట్ ఫైనాన్స్ దాదాపు 14 ఫైనాన్షియర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలా చాలా బ్యాంకులు ఉన్నాయి. మరింత మంది ఫైనాన్షియర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని కంపెనీ భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.