యాప్నగరం

Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతీ గ్రాండ్ విటారా, ధరెంతంటే?

Maruti Suzuki Grand Vitara: మార్కెట్లో ఎస్‌యూవీలకు గుబేలు పుట్టిస్తూ.. మారుతీ సుజుకి గ్రాండ్ విటారా గ్రాండ్‌లోకి భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎస్‌యూవీ కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా kushaq, ఫోక్స్‌వాగన్ Taigun, నిస్సాన్ కిక్స్, టాటా హ్యారియర్, ఎంజీ ఆస్ట్రర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే మారుతీ సుజుకి గ్రాండ్ విటారాకు కస్టమర్ల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. బుకింగ్స్ ఓ రేంజ్‌లో నమోదవుతున్నాయి. గ్రాండ్ విటారాను మార్కెట్లోకి లాంచ్ చేసిన మారుతీ సుజుకి.. ఈ వెహికిల్ ధర, ఇతరాత్ర వివరాలను ప్రకటించింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 26 Sep 2022, 3:15 pm

ప్రధానాంశాలు:

  • మారుతీ సుజుకి గ్రాండ్ విటారా లాంచ్
  • టయోటా భాగస్వామ్యంలో ఈ కారు తయారీ
  • ఎక్స్‌షోరూంలో రూ.10.45 లక్షల నుంచి ధర ప్రారంభం
  • 9 రంగుల్లో కస్టమర్ల ముందుకు వచ్చిన కొత్త ఎస్‌యూవీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Grand Vitara Launch
మారుతీ సుజుకి గ్రాండ్ విటారా లాంచ్
Maruti Suzuki Grand Vitara: మారుతీ సుజుకి గ్రాండ్ విటారా మార్కెట్లోకి వచ్చేసింది. మారుతీ సుజుకి ఎట్టకేలకు తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ను నెక్సా నుంచి గ్రాండ్‌గా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీంతో పాటు స్మార్ట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి లాంచ్ చేసింది. గ్రాండ్ విటారా(Grand Vitara) ఎస్‌యూవీ ధర ఎక్స్‌షోరూంలో రూ.10.45 లక్షలుగా ప్రారంభమై.. రూ.19.65 లక్షల వరకు ఉంది. గ్రాండ్ విటారా వెహికిల్‌ను మారుతీ సుజుకి టయోటా భాగస్వామ్యంలో రూపొందించింది. గ్లోబల్ సీ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపొందించింది. టయోటా హైరిడర్‌తో పాటు బెంగళూరులో ఉన్న టయోటా ప్లాంట్‌లోనే మారుతీ సుజుకి గ్రాండ్ విటారా కూడా తయారైంది. కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా kushaq, ఫోక్స్‌వాగన్ Taigun, నిస్సాన్ కిక్స్, టాటా హ్యారియర్, ఎంజీ ఆస్ట్రర్‌లకు మారుతీ సుజుకి గ్రాండ్ విటారా గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ కారుకి బుకింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. కస్టమర్ల మద్దతు చూసి.. కంపెనీనే ఆశ్చర్యపోయింది.
ఆరు వేరియంట్లలో మారుతీ సుజుకి గ్రాండ్ విటారా అందుబాటులో ఉంటుంది. సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, జెటా ప్లస్, ఆల్ఫా ప్లస్ ఆప్షన్లలో ఈ వెహికిల్ లభిస్తుంది. ఆరు మోనోటోన్, మూడు డ్యూయల్ ఆప్షన్లతో కలుపుకుని మొత్తం 9 రంగులలో మారుతీ సుజుకి గ్రాండ్ విటారా కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. నెక్సా బ్లూ, ఆర్టిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే, చెస్ట్‌నట్ బ్రౌన్, ఒపులెంట్ రెడ్, ఆర్టిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్, ఒపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రంగుల్లో ఈ కారు లభ్యం కానుంది. మాన్యువల్, ఆటోమేటిక్ మోడల్స్‌లో ఈ ఎస్‌యూవీ కొనుగోలుదారుల ముందుకు వచ్చింది.

Also Read : కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రైవేట్ బ్యాంకులు... నేటి నుంచే ఆ నిర్ణయం అమల్లోకి..!

మారుతీ సుజుకి గ్రాండ్ విటారా స్పెషిఫికేషన్లు(Maruti Suzuki Grand Vitara Specifications)
రెండు ఇంజిన్ ఆప్షన్లలో మారుతీ సుజుకి గ్రాండ్ విటారా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 1.5 లీటరు 4 సిలిండర్ పెట్రోల్, 1.5 లీటరు 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్లను కంపెనీ ఆపర్ చేసింది. లీటరుకి 21.11కి.మీ వరకు ఈ వెహికిల్ మైలేజ్ ఇవ్వనుంది. 1.5 లీటరు 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.. 103 బీహెచ్‌పీ పవర్, 137 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరో ఇంజిన్ 116 బీహెచ్‌పీ పవర్, 122 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 17 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌తో ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చింది. స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్ డ్యూయల్ బ్యాటరీతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

మారుతీ సుజుకి ప్రకటించిన ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్ స్పెషల్ ప్యాకేజీ ఆఫర్లు, వారెంటీతో మార్కెట్లోకి వచ్చాయి. ఐదేళ్ల వరకు లేదా లక్ష కి.మీల వరకు వారెంటీని కంపెనీ ఆఫర్ చేస్తుంది. రూ.67 వేల విలువైన ప్రెస్టైన్ జెన్యూన్ నెక్సా యాక్ససరీ ప్యాక్‌ను అందిస్తోంది. మారుతీ గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్‌ను జెట్ ప్లస్, ఆల్ఫా ప్లస్ వేరియంట్లలో కంపెనీ ఆఫర్ చేస్తుంది. వీటి ధర రూ.17.00 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్యలో ఉన్నాయి.

మారుతీ సుజుకి సబ్‌స్క్రిప్షన్ ద్వారా కూడా మీరు గ్రాండ్ విటారాను పొందవచ్చు. అయితే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు రూ.27 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వెహికిల్‌లో మారుతీ సుజుకి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. అన్ని సీట్లకు 3 పాయింట్ ఈఎల్ఆర్ సీటు బెల్ట్స్, ఏబీఎస్ ప్లస్ ఈబీడీతో ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ వెహికిల్‌లో ఉన్నాయి.

Also Read : కదిలే కల్యాణ మండపాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఆనంద్ మహింద్రా ట్వీట్ వైరల్


20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.