యాప్నగరం

Nita Ambani మేకప్ ఆర్టిస్ట్ Mickey Contractor జీతం తెలుసా? అందరు సీఈఓలను మించి.. రోజు సంపాదన తెలిస్తే?

Mickey Contractor: సెలబ్రిటీల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో లగ్జరీ లైఫ్ వారిది. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఇప్పుడు అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani) పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ఛార్జీ చూసి అంతకుమించి అవాక్కవుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు ఆయన ఎంత వసూలు చేస్తారో తెలుసా?

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 19 Mar 2023, 10:28 pm
Mickey Contractor: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ముకేశ్ అంబానీ (Mukesh Ambani) భార్య నీతా అంబానీ (Nita Ambani).. భారత్‌లోని మోస్ట్ స్టైలిష్ వ్యాపారవేత్తల్లో ఒకరు. ఈమె అంబానీకి చెందిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) టీం బాధ్యతలు చూస్తుంటారు. ఇంకా దాతృత్వంలోనూ చాలా ముందుంటారు. ఆమెకు సాంప్రదాయ భరతనాట్యంలోనూ ప్రావీణ్యం ఉంది. ఇక వీరికి ముగ్గురు పిల్లలు. అయితే ప్రస్తుతం నీతా అంబానీ వయసు 59. ఈ ఏజ్‌లోనూ ఆమె చాలా అందంగా కనిపిస్తుంటారు. ఎక్కడైనా వేడుకలకు, కార్యక్రమాలకు హాజరైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్స్, బిజినెస్ ఫంక్షన్స్ ఇలా ఏదైనా.. చక్కగా ముస్తాబవుతుంటారు. అయితే.. మనువడిని ఎత్తుకొని ఆడిస్తున్న ఈ వయసులో కూడా ఆమె ఇంత అందంగా కనిపించడం వెనుక కారణం ఎవరో తెలుసా. మిక్కీ కాంట్రాక్టర్ (Mickey Contractor). ఈయన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. నీతా Ambani సహా ఆమె కూతురు Isha Ambani, కోడలు శ్లోకా అంబానీ కూడా కాంట్రాక్టర్ దగ్గర మేకప్ (Makeup) చేయించుకుంటుంటారు.
Samayam Telugu nita ambani makeup artist


ఇక మిక్కీ కాంట్రాక్టర్ విషయానికి వస్తే ఈయన చాలా మంది సెలబ్రిటీలకు మేకప్ చేస్తుంటారు. బాలీవుడ్ ప్రముఖ తారలు కరీనా కపూర్, దీపికా పదుకొణె, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, శిల్పా శెట్టి, సోనాలి బింద్రె సహా ఎందరికో మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు నీతా అంబానీ సహా ఆమె కుటుంబంలోని ప్రముఖులకు మేకప్ చేస్తున్నారు. అయితే ఇది కాసేపు పక్కనబెడితే.. ఆయన మేకప్ చేసినందుకు ఎంత ఛార్జీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ జీతం గురించి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Relaince Retail: కూతురు Isha తో కలిసి Ambani దూకుడు.. బ్యూటీ వ్యాపారంలోకి ఎంట్రీ.. తొలి స్టోర్‌ ఎక్కడ ఎప్పుడంటే? Ambani కుటుంబానికి బాంబు బెదిరింపు కాల్స్.. Supreme Court కీలక ఆదేశాలు.. ఎక్కడికెళ్లినా సొంత ఖర్చుతో!

ఎవరు పడితే వారు మిక్కీ కాంట్రాక్టర్ దగ్గర మేకప్ సర్వీసులు పొందలేరు. ఆయన దగ్గర మేకప్ చేయించుకోవాలంటే ముంబయిలో రోజుకు ఒక్క వ్యక్తికి రూ.75 వేల నుంచి లక్ష అంతకుమించి కూడా వసూలు చేస్తుంటారట. ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర ఇది కాస్త ఎక్కువే ఉంటుందంట. ఇది చాలా కంపెనీల సీఈఓలకు మించి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక టోక్యో బ్యూటీ పార్లర్‌లో హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేస్తూ మిక్కీ ఇబ్బంది పడుతున్న రోజుల్లో.. నటి హెలెన్ ఆయనను సినిమాల్లో పనిచేయమని ఆహ్వానించారట. దీంతో మిక్కీ చాలా సినిమాలకు పనిచేశారు కూడా. హమ్ ఆప్కే హైన్ కౌన్, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషీ కబీ ఘమ్, కల్ హో నా హో, మొహబ్బతీన్, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తీక్, డాన్, వీర్ ది వెడ్డింగ్, గుడ్ న్యూస్, ఇంగ్లీష్ మీడియం వంటి సినిమాలకు పనిచేశారు.

ఇక ఇటీవల ముకేశ్ అంబానీ డ్రైవర్ కూడా వార్తల్లోకెక్కారు. ఆయన తీసుకునే జీతంపై నెట్టింట తెగ చర్చించుకున్నారు. అతడికి ముకేశ్ అంబానీ నెలకు రూ. 2 లక్షలకుపైనే ఇస్తున్నారట. అయితే ఇది ఐదేళ్ల కిందట. ఇప్పుడు అంతకంటే చాలానే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. వీటికి తోడు అదనపు ప్రోత్సాహకాలు ఉంటాయి. దీంతో ఇప్పుడు నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ జీతం కూడా చర్చనీయాంశమవుతోంది.

Ambani Driver జీతం ఎంతో తెలుసా? వార్నీ ఐటీ ఉద్యోగులను మించి.. నెలకు ఎన్ని లక్షలో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Ambani Niece: అంబానీ మేనకోడలు Isheta గురించి తెలుసా.. కోట్ల సంపద.. లగ్జరీ లైఫ్ అదిరింది కదా!

Read Latest Business News and Telugu News
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.