యాప్నగరం

Mercedes Benz: మార్కెట్లోకి కొత్త కార్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర తెలిస్తే మాత్రం దిమ్మదిరిగిపోద్ది..

Mercedes Benz: లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్- బెంజ్ భారత్‌లో తన ఎస్‌యూవీ ( SUV) మార్కెట్‌ను విస్తరించుకుంటుంది. కొత్తగా రెండు విలాసవంతమైన SUV లను లాంఛ్ చేసింది. మెర్సిడెస్ GLB, మెర్సిడెస్ EQB ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. ఈ రెండు కార్లు కూడా 7 సీటర్ సామర్థ్యంతో వస్తున్నాయి. అయితే వీటిల్లో అద్భుతమైన ఫీచర్లు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ల ధర తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఎక్స్‌షోరూం ధరలు, ఫీచర్లు తెలుసుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 7 Dec 2022, 7:07 am
Mercedes GLB: విలాసవంత కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్.. మరో రెండు కొత్త SUV మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. మెర్సిడెస్ GLB (Mercedes GLB), మెర్సిడెస్ EQB (Mercedes EQB) పేరుతో ఇవి వచ్చాయి. మెర్సిడెస్ బెంజ్ పెట్రోల్ (GLB 200), డీజిల్ (GLB 220d, GLB 220d 4M), EV (EQB 300) వేరియంట్లను అన్నింటినీ ఒకేసారి మార్కెట్లకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Samayam Telugu Mercedes benz glb
మెర్సిడెస్ బెంజ్


మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌బీ (Mercedes-Benz GLB) ప్రారంభ ధర రూ.63.8 లక్షలు కావడం విశేషం. దీని గరిష్ట ధర రూ.69.8 లక్షలుగా ఉంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబీ (Mercedes-Benz EQB) ధర రూ.74.5 లక్షలుగా నిర్ణయించింది. ఇది మెర్సిడెస్ EQB 300కు వర్తిస్తుంది. ఇవన్నీ భారత్‌లో ఎక్స్‌షోరూం ధరలే.

ఈ SUV లాంఛ్ సందర్భంగా మాట్లాడిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మార్టిన్ స్కెంక్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వర్సెటైల్ 7 సీటర్ SUVలు GLB, EQB లను తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు ప్రకటించారు.

Mercedes-Benz GLB features

మెర్సిడెస్ బెంజ్ GLB ఫీచర్ల విషయానికి వస్తే లెంత్, వీల్‌బేస్, హైట్ అన్నీ కూడా GLC ని పోలి ఉంటాయి. మంచి స్పేస్ ఉండటమే కాకుండా గరిష్ట బూట్ కెపాసిటీ 1680 లీటర్లుగా ఉంది. ఇందులో మూడో వరుస సీటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇందులో ఇద్దరు కూర్చునేందుకు వీలుంటుంది. మొత్తంగా ఏడుగురు కూర్చోవచ్చు. పైన చెప్పుకున్నట్లుగా మొత్తం 3 వేరియంట్లు.. 4- సిలిండర్ ఇంజిన్‌తో వచ్చాయి. 1950cc టోటల్ డిస్‌ప్లేస్‌మెంట్, 140kWh అవుట్‌పుట్ ఇస్తుంది. ఇది 7.6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్లను అందుకోగలదు. ఇంకా హై రిజల్యూషన్ స్క్రీన్స్, గ్రాఫిక్స్, లెర్నింగ్- కేపబుల్ సాఫ్ట్‌వేర్, వాయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పేటీఎంలో డబ్బులు పెట్టారా? అయితే మీకో గుడ్‌న్యూస్.. త్వరలోనే!
రెండు అపార్ట్‌మెంట్లు రెంట్‌కు తీసుకున్న రోహిత్ శర్మ.. నెలకు కట్టే అద్దె తెలిస్తే..

Mercedes-Benz EQB Features

Mercedes-Benz EQB 300 4MATIC ఎలక్ట్రిక్ కార్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. మాగ్జిమమ్ వోల్టేజీ 367 V గా ఉంది. పవర్ అవుట్‌పుట్ 168 kW, టార్క్ 390 Nm ఉత్పత్తి చేస్తుంది. మాగ్జిమమ్ బూట్ కెపాసిటీ 1620 లీటర్లుగా ఉంది. ఇది పూర్తిగా విద్యుత్ వాహనం.

మెర్సిడెస్ GLB వైట్, బ్లాక్, గ్రే, రెడ్ కలర్స్‌లో వస్తోంది. EQB ని బ్లాక్, వైట్, గ్రే, సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో తీసుకొస్తున్నారు. అయితే మెర్సిడెస్ EQBని.. పుణెలోని ప్లాంట్‌లో తయారుచేస్తుండగా.. GSBని మాత్రం విదేశాల నుంచి ఎగుమతి చేసుకోనున్నారు. ఎలక్ట్రిక్ వాహనం కోసం పలు ప్రాంతాల్లో అల్ట్రాఫాస్ట్ ఛార్జర్లను అమర్చినట్లు మార్టిన్ వెల్లడించారు.


20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read: భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. రూ.3600 జంప్.. 3 రోజుల్లోనే తలకిందులు!
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.