యాప్నగరం

ఆధార్ హెచ్చరిక.. అలా చేస్తే రూ.10,000 జరిమానా!

మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే జరజాగ్రత్త. ఆర్థిక లావాదేవీల సమయంలో ఆధార్ నెంబర్ తప్పుగా సమర్పిస్తే ఏకంగా రూ.10,000 జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది. ఒక్కసార కాదు.. మీరు నెంబర్ తప్పుగా ఇచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది.

Samayam Telugu 14 Jul 2019, 5:49 pm

ప్రధానాంశాలు:

  • ఆధార్ కార్డు ఉపయోగించే ప్రతి ఒక్కరికీ అలర్ట్
  • ఇకపై ఆధార్ నెంబర్ వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండండి
  • తప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తే రూ.10 వేల ఫైన్ ఎదుర్కోవాలి
  • సెప్టెంబర్ 1 నుంచి రూల్ అమలులోకి వచ్చే అవకాశం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AADHAAR
మీకు ఆధార్ కార్డు ఉందా? అయితే జాగ్రత్తగా ఉండండి. లేదంటే రూ.10,000 ఫైన్ ఎదుర్కోవలసి ఉంటుంది. ఎలా అంటారా? ఆర్థిక లావాదేవీల సమయంలో మీరు మీ ఆధార్ నెంబర్‌ను తప్పుగా సమర్పిస్తే ఈ మొత్తం జరిమానా పడుతుంది. ఒక్కసారి కాదు మీరు ఎన్నిసార్లు తప్పుగా మీ ఆధార్ నెంబర్ ఇస్తారో.. ప్రతిసారీ ఇదే జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వపు ఆధార్ జరిమానా నిర్ణయం ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచే అమలులోకి వచ్చే అవకాశముంది. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చట్టాలను సవరించనుంది. నిర్మలా సీతారామర్ తన తొలి బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీకు సవరణకు ప్రతిపాదించారు. ఇందులోనే పెనాల్టీ అంశం ప్రస్తావన్ ఉంది.

కేవలం 10 నిమిషాల్లోనే పాన్ కార్డు.. తెలుసుకోవలసిన 5 అంశాలు ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పాన్, ఆధార్ కార్డులు ఇంటర్‌చేంచబుల్ అని పేర్కొన్నారు. అలాగే పాన్ కార్డు లేకపోయినా కూడా ఐటీ రిటర్నులు దాఖలు చేయవచ్చని, ఆధార్ సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. పాన్ అవసరమైన చోటు ఆధార్ నెంబర్‌ ఇచ్చినా సరిపోతుందని పేర్కొన్నారు.

ఆధార్‌తో పాన్ లింక్ అయ్యిందా? 30 సెకన్లలో చెక్ చేసుకోండి!

ప్రస్తుతం 120 కోట్లకు పైగా ఆధార్ నెంబర్లు ఉన్నాయి. దాదాపు 41 కోట్ల పాన్ నెంబర్లు ఇష్యూ చేశారు. వీటిలో 22 కోట్ల పాన్‌ నెంబర్లు ఆధార్‌తో లింక్ అయ్యాయి. మరోవైపు ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసే అవకాశముంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.