మారుతీ బాలెనో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లో ఎక్కువగా విక్రయమయ్యే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఇది. అయితే ఇందులో ఒక మోడిఫైడ్ వెర్షన్ ఒకటి అందరి చూపు ఆకర్షిస్తోంది.
మారుతీ సుజుకీ బాలెనో కారును 360 మోటారింగ్ అనే సంస్థ మోడిఫైడ్ చేసింది. మోడిఫైడ్ కారు చూస్తే వావ్ అంటాం. అంత బాగుంది. చూపుకూడా తిప్పుకోలేం. ఎరుపు రంగు బాడీ, నలుపు రంగు టాప్, పక్షి రెక్కల లాంటి డోర్లు వంటి ప్రత్యేకతలతో అందరినీ ఆకట్టుకుంటోంది ఈ మోడిఫైడ్ బాలోనో కారు.
కారు ముందు భాగంలో రీడిజైన్ బంపర్‌ను, అల్ బ్లాక్ గ్రిల్‌ను చూడొచ్చు. ఫాగ్ లైట్ సెక్షన్‌ను కూడా రివైజ్ చేసేశారు. వెనుక భాగంలో బంపర్‌ను కూడా కస్టమైజ్ చేశారు. డోర్లు లంబోర్గిని కారు స్టైల్లో ఉన్నాయి. ఇంకా ఈ కారులో పెద్ద 5 స్పోక్ అలాయ్ వీల్ డిజైన్, 17 అంగుళాల వీల్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇకపోతే మారుతీ బాలెనో కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. 1 లీటర్, 1.2 లీటర్, 1.3 లీటర్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ.5.38 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ధర రూ.8.5 లక్షలు.
Maruti Baleno: ఇది లంబోర్గిని కారు కాదు.. మారుతీ కారు
మారుతీ బాలెనో కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. 1 లీటర్, 1.2 లీటర్, 1.3 లీటర్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ.5.38 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ధర రూ.8.5 లక్షలు.
Samayam Telugu 8 Apr 2019, 10:28 am
ప్రధానాంశాలు:
- నమ్మలేకపోతున్నారా? ఇది నిజం
- మారుతీ బాలెనో కారులో మోడిఫైడ్ వెర్షన్ ఇది
- లంబోర్గిని స్టైల్ డోర్లతో అందిరనీ ఆకట్టుకుంటున్న కారు