యాప్నగరం

ఆన్‌లైన్‌లో సులభంగా డబ్బు సంపాదించండి.. ఇలా చేస్తే అదిరే రాబడి!

ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీడియోలు చూడటం దగ్గరి నుంచి ఈమెయిల్స్ చదవడం వరకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి .

Samayam Telugu 17 Mar 2021, 2:56 pm

ప్రధానాంశాలు:

  • సులభంగానే డబ్బు సంపాదించండి
  • ఆన్‌లైన్‌లో పలు ఆప్షన్లు
  • అవేంటో తెలుసుకోండి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu business idea
డబ్బు సంపాదించాలని యోచిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే డబ్బు సంపాదించే ఛాన్స్ కూడా ఉంది. కొన్ని యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా ఇంట్లో నుంచే డబ్బు సంపాదించొచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
పెయిట్ టు క్లిక్ వెబ్‌సైట్లు ఉంటాయి. ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీరు యాడ్స్‌పై క్లిక్ చేసి రాబడి పొందొచ్చు. ClixSense.com, BuxP, NeoBux వంటి వాటిని పీటీసీ సైట్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకా వీడియోలు చూస్తూ కూడా డబ్బులు సంపాదించొచ్చు. InboxDollars వంటి సంస్థలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

కొన్ని యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా డబ్బులు పొందొచ్చు. ScreenLift, Fronto, Slidejoy, Ebota వంటి వాటి ద్వారా రాబడి లభిస్తుంది. కొన్ని సైట్లు మీరు గేమ్స్ ఆడినా కూడా డబ్బులు అందిస్తాయి. గిఫ్ట్ వోచర్లు, రివార్డు పాయింట్లు లభిస్తాయి. Second Life, Swagbucks, Lucktastic, Mistplay వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

Survey Junkie వంటి సైట్ మీరు సర్వేలో పాల్గొన్నా కూడా రాబడి అందిస్తుంది. MatrixMail.com, CashforOffer.com అనే వెబ్‌సైట్లు ఈమెయిల్స్ చదివినందుకు డబ్బులు అందిస్తుంది. ఇలా మీరు ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించే ఛాన్స్‌లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.