యాప్నగరం

ED Rides on VIVO : స్మార్ట్‌ఫోన్ దిగ్గజానికి భారీ ఎదురుదెబ్బ.. కొరడా ఝుళిపించిన ఈడీ

చైనీస్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. గత రెండేళ్ల క్రితం చైనాతో మనకు సరిహద్దు సమస్యలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశ కంపెనీలపై స్క్రుటినీని పెంచింది. అంతేకాక ఆర్థిక అవకతవకలకు పాల్పడితే.. అసలు ఊరుకోవడం లేదు. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో, దానికి సంబంధించిన కంపెనీల ఆఫీసులలో ఈడీ రైడ్స్ చేసింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 5 Jul 2022, 1:35 pm

ప్రధానాంశాలు:

  • చైనీస్ కంపెనీలపై కఠిన చర్యలు
  • వివో, దాని సంబంధిత కంపెనీలపై ఈడీ రైడ్స్
  • దేశవ్యాప్తంగా 44 ప్రాంతాలలో ఈడీ దాడులు
  • ఆర్థిక అవకతవక ఆరోపణలు ఎదుర్కొంటోన్న కంపెనీలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ED Raids on Vivo
వివో కంపెనీపై ఈడీ దాడులు
ED Rides on VIVO : చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. వివో, దాని సంబంధిత సంస్థలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాలలో ఈడీ దాడులు చేపట్టింది. చైనాకు చెందిన వ్యాపారాలపై స్క్రుటినీని పెంచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. వివో మొబైల్ కమ్యూనికేషన్స్ కో, జెడ్‌టీఈ కార్పొరేషన్‌కు చెందిన స్థానిక యూనిట్లు ఆర్థిక అవకతవకలు ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. షావోమి కార్పొరేషన్‌పై కూడా ఈ దర్యాప్తు సంస్థ ఓ కన్నేసి ఉంచింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ)కి చెందిన సెక్షన్ల కింద ఈడీ ఈ దాడులు చేసింది. వివో, దానికి సంబంధింత కంపెనీలకు చెందిన 44 ప్రాంతాలలో దాడులు కొనసాగినట్టు ఈడీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఈడీ తనిఖీలు(ED Raids) చేపట్టిన వివో ఆఫీసులు బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఉన్నాయి. ఈ ప్రాంతాలలోని వివో కంపెనీల ఆఫీసులపై ఈడీ తనిఖీలు చేపట్టింది.

Also Read : Trending Stock : మహింద్రా ఈ స్టాక్‌కి మస్తు లాభాలు.. ప్రారంభంలోనే పైపైకి!

కాగా, ఏప్రిల్ నెలలోనే ఈడీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో షావోమి ఇండియా నుంచి రూ.5,551.27 కోట్లను సీజ్ చేశారు. కంపెనీ అక్రమ అవుట్‌వర్డ్ రెమిటెన్సెస్‌కు పాల్పడుతుందనే కారణంతో ఈ డబ్బును ఈడీ సీజ్ చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) ప్రొవిజన్ల కింద కంపెనీ బ్యాంకు అకౌంట్ల నుంచి ఈ డబ్బులను సీజ్ చేసింది.

2020 భారత్, చైనాల మధ్య సరిహద్దు సమస్యలు నెలకొనడంతో.. చైనీస్ సంస్థలపై స్క్రుటినీ పెరిగింది. ఈ కంపెనీలపై స్క్రుటినీలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. అప్పటి నుంచి చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా 200కి పైగా మొబైల్ యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది. అయితే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా తామే ఉన్నామంటూ చైనా చెబుతోంది. కానీ తమకు తమకు అతిపెద్ద ట్రేడ్ పార్టనర్ అమెరికా అంటూ భారత్ తెలుపుతోంది.

Also Read : 16 వేల మార్కును తాకిన నిఫ్టీ.. అప్పర్ సర్క్యూట్‌లో ఈ పెన్నీ స్టాక్స్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.