యాప్నగరం

ఏప్రిల్ 1 నుంచి 'విలీన'బ్యాంకు సేవలు!

సెప్టెంబరు నెలాఖరులో జరిగే సంబంధిత బ్యాంకుల బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల మేరకు విలీన ప్రక్రియ విధాన ప్రక్రియ రూపొందుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Samayam Telugu 19 Sep 2018, 6:33 pm
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనం అనంతరం ఏర్పడే కొత్త బ్యాంకు కార్యకలాపాలు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విలీన బ్యాంకుల కార్యకలాపాలకు సంబంధించి.. ఆర్థిక శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త బ్యాంకు కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఒకటో తేది (01.04.2019) నుంచి ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆలోపు అవసరమైన అనుమతులన్నీ పొందడమే కాకుండా, దానికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయని ఆయన అంటున్నారు.
Samayam Telugu banks


సెప్టెంబరు నెలాఖరులో జరిగే సంబంధిత బ్యాంకుల బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల మేరకు విలీన ప్రక్రియ విధాన ప్రక్రియ రూపొందుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. షేర్ల బదలాయింపు నిష్పత్తి, ప్రభుత్వం నుంచి అందాల్సిన మూలధన సాయం లాంటి వివరాలు ఈ విధానంలో ఉంటాయని తెలిపాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంకుల విలీనానికి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని 'ప్రత్యామ్యాయ వ్యవస్థ' సోమవారం (సెప్టెంబరు 17) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూడింటి కలయికతో ఏర్పడే కొత్త బ్యాంకు రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.