యాప్నగరం

నూతన డిజైన్‌తో వస్తోన్న సరికొత్త పాన్ కార్డు

సరికొత్త లుక్‌తో ఉన్న పాన్ కార్డును జనవరి 1 నుంచి పంపిణీ చేస్తున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు.

TNN 14 Jan 2017, 1:25 pm
ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డ్ ఎంతో కీలకం. పెద్దమొత్తంలో సొమ్మును అకౌంట్లో జమచేయాలంటే పాన్ కార్డు తప్పనిసరి. నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తోన్న ప్రతి ఒక్కరికీ పాన్‌ను తప్పనిసరి చేసే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. ఈ కార్డును ట్యాంపరింగ్ చేసే వీల్లేకుండా సరికొత్త హంగులు అద్దుతోంది. సరికొత్త లుక్‌తో, ఫీచర్లతో కూడిన పాన్ కార్డును ఐటీ అధికారులు రూపొందించారు. ఇప్పటి వరకూ పాన్ కార్డుపై ఇంగ్లిష్‌లో మాత్రమే వివరాలు ఉండగా.. కొత్తవాటిలో హిందీలోనూ ఉండనున్నాయి. ఎన్‌ఎస్‌డీఎల్, యూటీఐఐఎస్ఎల్ ముద్రిస్తోన్న ఈ కొత్త పాన్ కార్డుల పంపిణీ జనవరి 1 నుంచి ప్రారంభమైంది కూడా.
Samayam Telugu new pan cards being issued by the government
నూతన డిజైన్‌తో వస్తోన్న సరికొత్త పాన్ కార్డు


కొత్తగా పాన్ కార్డు తీసుకునేవారికి వీటి పంపిణీ కొనసాగుతుండగా.. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కొత్తవాటిని తీసుకోవాలంటే మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ప్రక్రియలో ఉపయోగపడేలా క్విక్ రెస్పాన్స్ కోడ్‌ అనే ఫీచర్‌ను కొత్త పాన్ కార్డుల్లో పొందుపర్చారు. కొత్తవాటిలో మన సంతకం ఉండే ప్రదేశం కూడా మారనుంది. దేశంలో ఇప్పటికే 25 కోట్ల మందికి పాన్ కార్డు ఉండగా.. ఏటా 2.5 కోట్ల మంది కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.