యాప్నగరం

ఆర్‌బీఐ నుంచి త్వరలో కొత్త రూ. 20 నోటు..

త్వరలో రూ. 20 కొత్త నోటు విడుదల కానుంది. సరికొత్త ఫీచర్లతో ఆర్‌బీఐ సిద్ధం చేసింది.

Samayam Telugu 25 Dec 2018, 7:13 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అదనపు ఫీచర్లతో కొత్త రూ. 20 నోటును విడుదల చేయనుంది. రూ. 10, రూ. 50, రూ. 200, రూ. 500, రూ. 2000 నోట్లకు సంబంధించి భారతీయ కేంద్ర బ్యాంక్ ఇప్పటికే కొత్త నోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త సిరీస్ నోట్లు 2016 నవంబర్ నుంచి చెలామణిలో ఉన్నాయి. పాత నోట్లతో పోలిస్తే.. ఈ నోట్లు పరిమాణంలో కాస్త చిన్నవిగా ఉన్నాయి. రంగు మాత్రం మరింత ఆకర్షణీయంగా ఉంది.
Samayam Telugu rbi


నోట్ల రద్ద తర్వాత వివిధ డినామినేషన్ల కొత్త నోట్లన్నింటినీ విడుదల చేసిన ఆర్‌బీఐ ఇప్పటివరకూ రూ. 20 నోటును మాత్రం విడుదల చేయలేదు. దీంతో త్వరలో ఈ నోటును మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తు ప్రారంభమైంది. దీంతో పాటు కొత్త రూ. 100 నోటు కూడా విడుదల చేయాల్సి ఉంది. 2018 మార్చి వరకు ఉన్న గణాంకాల ప్రకారం.. చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 20 నోట్లు 9.8 శాతం ఉండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.