యాప్నగరం

రికార్డ్: తొలిసారి 9,300 మార్క్ దాటిన నిఫ్టీ

నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది.

TNN 25 Apr 2017, 6:01 pm
నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో తొలిసారి 9,300 మార్కును దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు మరికొన్ని కంపెనీల మార్కెట్ విలువలు పెరగడంతో నిఫ్టీ రికార్డు స్థాయి మార్కుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 5న నమోదైన 9,273.90 పాయింట్లే అత్యధికం. ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి ఏకంగా 9,300 పాయింట్లకు నిఫ్టీ చేరుకుంది.
Samayam Telugu nifty breaches 9300 mark for first time
రికార్డ్: తొలిసారి 9,300 మార్క్ దాటిన నిఫ్టీ


మొత్తం 50 షేర్లతో కూడిన నిఫ్టీ 88.65 పాయింట్లు పైకి ఎగబాకి జీవితకాల గరిష్ఠం 9,306.60 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ కూడా 287.40 పాయింట్లు ఎగబాకి 29,943.24 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారక విలువ రూ. 64.21గా ఉంది.

నాలుగో త్రైమాసికంలో రూ. 8,046 కోట్ల లాభాన్ని అర్జించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించడంతో ఈరోజు స్టాక్ ఎక్సేంజ్‌లో దూసుకుపోయింది. 1.21 శాతం వృద్ధి సాధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ రూ. 1433.50కు పెరిగింది. దీంతో నాలుగేళ్ల తర్వాత మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానానికి చేరింది. దీంతో పాటు ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటో కార్ప్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఐటీసీ లిమిటెడ్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ 3.36 శాతం వృద్ధి సాధించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.