యాప్నగరం

Stock Market News: మార్కెట్లకు ఆర్‌బీఐ, చమురు దెబ్బ

అంతర్జాతీయ పరిణామాలుచ ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ క్షీణించడం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.

Samayam Telugu 5 Dec 2018, 11:27 am
దేశీయ స్టాక్‌మార్కెట్లు వరసగా రెండోరోజు (బుధవారం) కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ దాదాపు వంద పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 10,800 పాయింట్ల వద్ద ట్రేడైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలుచ ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ క్షీణించడం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.
Samayam Telugu sensexdown


ఉదయం 11.15 గంటల సమయానికి సెన్సెక్స్‌ 216 పాయింట్లు పతనమై 35,917 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 10786 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా 7 పైసలు క్షీణించి 70.56 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్ఈలో భారతీ ఇన్‌ప్రా, ఎన్‌టీపీసీ, అదానీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇండస్‌ఇండ్‌, బ్యాంక్‌ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌బ్యాంక్‌, ఎస్‌ బ్యాంకు,యాక్సిస్‌ బ్యాంకు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హిండాల్కో, టాటా స్టీల్‌, గ్రాసిం, వేదాంత షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.