యాప్నగరం

స్టాక్ మార్కెట్: నష్టాల నుంచి లాభాల్లోకి..

గురువారం నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జులై 6) స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయ కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 6 Jul 2018, 5:14 pm
గురువారం నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జులై 6) స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయ కొనుగోళ్లు పెరగడంతో ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 200 పాయింట్ల లాభానికి ఎగబాకగా, నిఫ్టీ 10,800 మార్క్‌ను దాటింది. ట్రేడింగ్ చివరి గంటలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు దిగొచ్చాయి. దీంతో ట్రేడింగ్ ముగింపు సమయానికి సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 35,657.86 వద్ద, నిఫ్టీ 22.9 పాయింట్లు లాభపడి 10,772.65 వద్ద స్థిరపడ్డాయి.
Samayam Telugu market31


డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.97గా కొనసాగుతోంది. మరోవైపు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గి 30,630 వద్ద కొనసాగుతోంది. ట్రేడింగ్‌లో ఆటోమొబైల్‌, ఐటీ, విద్యుత్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు భారీగా లాభాలను చవిచూశాయి.

నేషనల్ స్టాక్‌ఎక్స్ఛేంజ్‌లో టీసీఎస్, హిందుస్థాన్‌ పెట్రోలియం, హీరో మోటోకార్ప్‌‌, డిష్ టీవీ, అలహాబాద్ బ్యాంక్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌ తదితర షేర్లు లాభాలను చవిచూశాయి. మరోవైపు టెక్‌ మహీంద్రా, సిప్లా, సన్‌ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాల బాటలో పయనించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.