యాప్నగరం

ఐఫోన్ కస్టమర్లకు ఓ మంచి అప్‌గ్రేడ్ ఆఫర్!

లేటెస్ట్ ఐఫోన్లు కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ఓ మంచి అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్.. ఆఫర్ చేస్తోంది.

TNN 7 Mar 2017, 12:30 pm
లేటెస్ట్ ఐఫోన్లు కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ఓ మంచి అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్.. ఆఫర్ చేస్తోంది. యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్.. మొబైళ్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా కొనేవారికి ఫ్లాట్ 5% డిస్కౌంట్‌తో పాటు రూ.25,100 వరకూ ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తున్నారు. ఇది అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కాబట్టి.. మీరు మీ పాత ఐఫోన్లను ఇచ్చేసి, ఎక్స్చేంజ్ విధానంలో ఐఫోన్ 7 మోడళ్లను పొందవచ్చు. ఈవిధానంలో ఐఫోన్-4, 4s, 5, 5s, 5c, 6, 6 Plus, 6s Plus, SE హ్యాండ్‌సెట్లను మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు.
Samayam Telugu now buy iphone 7 iphone 7 plus at a discount of up to rs 31200
ఐఫోన్ కస్టమర్లకు ఓ మంచి అప్‌గ్రేడ్ ఆఫర్!


ఈ పద్ధతిలో ఐఫోన్ వినియోగదారులకు రూ.60,000 విలువైన 32 GB ఐఫోన్‌-7పై 5% డిస్కౌంట్ లభిస్తోంది. అంటే డిస్కౌంట్ తీసేశాక దీని విలువ రూ.57,000. దీంతో పాటు రూ.21,800 వరకూ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా కలుపుకుంటే ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.35,200 లకే దక్కించుకోవచ్చన్నమాట. ఇతర ఐఫోన్ మోడళ్లపై కూడా ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నారు.

ఇదే పద్ధతిలో 128 GB ఐఫోన్-7, 256 GB ఐఫోన్-7 మోడళ్లను వరసగా రూ.43,200, రూ.51,200లకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. వీటి ఒరిజినల్ విలువ వరసగా రూ.70,000, రూ.80,000గా ఉంది. ఐఫోన్-7 ప్లస్ మోడళ్లైతే.. రూ.72,000 విలువైన 32 GB స్టోరేజ్ వెర్షన్‌ హ్యాండ్‌సెట్‌ను రూ.44,800లకు, రూ.82,000 విలువైన 128 GB స్టోరేజ్ వెర్షన్‌ హ్యాండ్‌సెట్‌ను రూ.52,800లకే పొందవచ్చు. మీ ఓల్డ్ వెర్షన్ ఐఫోన్‌ను మార్చుకోవాలనుకుంటున్నారా.. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే ఫ్లిప్‌కార్ట్ ద్వారా లాగిన్ అవండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.