యాప్నగరం

10 వేల మైలురాయిని అందుకున్న నిఫ్టీ

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ చరిత్ర సృష్టించింది. మదుపర్ల పెట్టుబడుల అండతో మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా..

TNN 25 Jul 2017, 1:09 pm
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ చరిత్ర సృష్టించింది. మదుపర్ల పెట్టుబడుల అండతో మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా 10,000 మైలురాయిని అందుకుంది. సోమవారం (జులై 24) మార్కెట్ చరిత్రలోనే రికార్డు స్థాయి గరిష్ట విలువలతో ముగిసిన సూచీలు.. మంగళవారం కూడా అదే జోరును కొనసాగించాయి. కిందటి సెషన్స్‌లో 10 వేల మైలురాయికి 44 పాయింట్ల దూరంలో ఆగిపోయిన నిఫ్టీ.. మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది క్షణాలకే 10 వేల మార్క్‌ను అందుకుంది. చరిత్రలో తొలిసారిగా 10,000 పాయింట్లను దాటి 10,046.95 వద్ద ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ వెంటనే మళ్లీ 9,990కి పడిపోయింది. ప్రస్తుతం 9,955.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
Samayam Telugu nse nifty makes history touches 10000
10 వేల మైలురాయిని అందుకున్న నిఫ్టీ


మరోవైపు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్‌ కూడా లాభాల్లో ప్రారంభమైంది. కిందటి సెషన్లో 32,246 వద్ద ముగిసిన సెన్సెక్స్‌.. ఈ ఉదయం 100 పాయింట్లకు పైగా లాభపడి 32,348 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 32,210 వద్ద కొనసాగుతోంది.

రుతుపవనాల ప్రభావం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర బ్యాంకింగ్‌ రంగ సంస్థలతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హీరో మోటోకార్ప్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.