యాప్నగరం

NIFTY 50 Index: అప్పులు కట్టినా.. నిఫ్టీ సూచీల్లో Adani Group షేర్లు మాయం.. తొలగించిన NSE

NIFTY 50 Index: అదానీ గ్రూప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిఫ్టీ అల్ఫా 50 ఇండెక్స్ (Nifty Alpha 50 Index) నుంచి అదానీ గ్రూప్‌కు చెందిన 4 స్టాక్స్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (NSE) తొలగించింది. ఇక ఈ స్థానంలో వేరే షేర్లను తీసుకొచ్చింది. అవేంటో చూద్దాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 10 Mar 2023, 7:42 pm
NIFTY 50 Index: దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు మరోసారి NSE షాక్ ఇచ్చింది. నిఫ్టీ 50 Alpha Index నుంచి 4 అదానీ గ్రూప్ షేర్లను NSE (National Stock Exchange) తొలగించింది. మార్చి 31 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. అదానీ గ్రూప్ స్టాక్స్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు ఇందులో ఉన్నాయి. ఇక Nifty 100 Alpha Index నుంచి కూడా అదానీ పోర్ట్స్ లిమిటడ్‌ను తీసేసింది ఎన్‌ఎస్‌ఈ. నిఫ్టీ 200 Alpha Index నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించింది. నిఫ్టీ లో వోలటాలిటీ ఇండెక్స్ నుంచి Adani గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్స్, ACC లు తీసేసింది. అదానీ గ్రూప్ సంస్థలతో పాటు మరికొన్ని ఇతర కార్పొరేట్ గ్రూప్‌లకు చెందిన సంస్థలు కూడా స్థానం కోల్పోయాయి.
Samayam Telugu adani group


ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, Angel One, ఎల్గి ఎక్విప్‌మెంట్స్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, KEI Industries, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, పేజ్ ఇండస్ట్రీస్, ేీిSEF, సుజ్లాన్ ఎనర్జీ, టాటా ఎలాగ్జీ షేర్లను కూడా నిఫ్టీ అల్ఫా 50 Index నుంచి తొలగించిన జాబితాలో ఉన్నాయి. ఇక వీటి స్థానాల్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్, Apollo Tyres, బ్యాంక్ ఆఫ్ ఇండియా, BHEL, బ్రిటానియా, IDFC ఫస్ట్ బ్యాంక్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, L&T Finance, MRF Limited, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, PNB, సీమెన్స్ వంటివి నిఫ్టీ Alpha 50 ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నాయి.

EPFO: ఒక్క నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ మీ ఫోన్‌కు మెసేజ్.. ఇప్పుడే ట్రై చేయండి! Elon Musk Bodyguards: మస్క్ బాత్రూం వెళ్లినా ఇద్దరు బాడీగార్డ్స్.. ఉద్యోగులపై నమ్మకం లేకేనా? అసలు కారణం మాత్రం..

ఆ లోన్ చెల్లించిన అదానీ గ్రూప్..

అదానీ గ్రూప్ తాజాగా 900 మిలియన్ డాలర్ల షేర్ బ్యాక్డ్ లోన్లను తెరిగి చెల్లించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.7,374 కోట్లు. ప్రమోటర్లకు చెందిన షేర్లను తాకట్టు పెట్టి ఈ లోన్ గతంలో తీసుకుంది. ఇప్పుడు ఆ షేర్లు విడుదల కానున్నాయి. ఇక నెల ముగిసే సరికి తనఖా పెట్టిన మిగతా రుణాలన్నింటిని కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అప్పులపైనే అదానీ గ్రూప్ ఎక్కువగా ఆధారపడుతుందనే ముద్రను ఇన్వెస్టర్ల నుంచి తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది అదానీ గ్రూప్. అందులో భాగంగానే అప్పులను చెల్లిస్తూ వస్తోంది. రుణ రహితంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది అదానీ గ్రూప్.

గడిచిన 4 సంవత్సరాలలో అదానీ గ్రూప్ రుణాలు మొత్తం రెట్టింపు అవ్వడం గమనార్హం. 2019లో అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.1.11 లక్షల కోట్లు ఉంటే.. 2023లో అది రూ.2.21 లక్షల కోట్లకు పెరిగింది. ఇక హిండెన్‌బర్గ్ రిపోర్ట్ అనంతరం అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల మళ్లీ పుంజుకుంటున్నాయి.

Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్ సిమ్ ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఒకే ప్రీపెయిడ్ ప్లాన్‌లో 3 OTT సబ్‌స్క్రిప్షన్లు నెల తర్వాత గౌతమ్ అదానీకి అతిపెద్ద ఊరట.. NSE కీలక ప్రకటన.. ఏం చేసిందంటే?

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.