యాప్నగరం

గ్రీన్ కార్డు రావాలంటే 151 ఏళ్లు

అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగి ఉండి, అద్భుత ప్రతిభా సామర్థ్యాలు, నైపుణ్యం కలిగి ఉన్న భారతీయులు గ్రీన్కార్డ్ లేదా శాశ్వత పౌరసత్వం కోసం 150 సంవత్సరాల పాటు ఎదురు చూడాలట.

Samayam Telugu 17 Jun 2018, 11:45 am
అమెరికా వెళ్లాలనుకునే వారికి గ్రీన్ కార్డ్ ఓ కల. శాశ్వతంగా అక్కడ సెటిల్ కావడానికి వీలు కల్పించే చట్టపరమైన వెసులుబాటు. కానీ ఇది లభించడం రోజు రోజుకు కష్టతరమవుతోందట. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగి ఉండి, అద్భుత ప్రతిభా సామర్థ్యాలు, నైపుణ్యం కలిగి ఉన్న భారతీయులు గ్రీన్కార్డ్ లేదా శాశ్వత పౌరసత్వం కోసం 150 సంవత్సరాల పాటు ఎదురు చూడాలట. ఈ మేరకు కాటో ఇనిస్టిట్యూట్ విశ్లేషణ నివేదికను విడుదల చేసింది. అమెరికా పౌర‌స‌త్వ‌, వ‌ల‌స‌ల విభాగం(యూఎస్‌సీఐఎస్) విడుద‌ల చేసిన శాశ్వ‌త నివాస ద‌ర‌ఖాస్తుల వివ‌రాల‌ను సంస్థ విశ్లేషించింది.
Samayam Telugu over 4 lakh indians may have to wait 151 years to get green card
గ్రీన్ కార్డు రావాలంటే 151 ఏళ్లు

యూఎస్‌సీఐఎస్


  1. దీని ప్ర‌కారం దాదాపు నాలుగు లక్షల మంది భారతీయుల గ్రీన్ కార్డ్ కల నెరవేరాలంటే వారు 151 సంవత్సరాలు వేచి చూస్తేనే లభిస్తుందని తెలిపింది.
  2. ఏప్రిల్20, 2018 నాటికి గ్రీన్‌కార్డుల కోసం 6,32,219 మంది భార‌తీయులు అప్లై చేసుకున్నారు. ఆయా ద‌ర‌ఖాస్తుదారుల్లో కార్మికుల‌తో పాటు వారి జీవిత భాగ‌స్వాములు, వారి పిల్ల‌లు ఉన్నారు.
  3. అత్య‌ధిక నైపుణ్యాల విభాగంలోని అసాధార‌ణ సామ‌ర్థ్యం కేట‌గిరీ కింద అమెరికా వ‌చ్చిన భార‌తీయ కార్మికులు గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూడాల్సిన స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంది. ఈ త‌ర‌హా వ్య‌క్తులు ఆరేళ్లు వేచిచూస్తే గ్రీన్ కార్డులు చేతికి అందే వీలున్న‌ట్లు విశ్లేష‌ణ‌లో తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.