యాప్నగరం

Overdraft: ఎమర్జెన్సీగా డబ్బులు కావాలా? అకౌంట్లో జీరో ఉన్నా పర్లేదు.. ఇలా తీసుకోవచ్చు!

Overdraft: ఒక్కోసారి మన అకౌంట్లో బ్యాలెన్స్ లేనప్పుడే డబ్బుల అవసరం ఏర్పడుతుంటుంది. ఆ సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద తీసుకుంటారు. ప్రతి సారీ వారిని అడిగలేరు. ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ ఆప్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా డబ్పులు డ్రా చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణం కన్నా చాలా తక్కువ వడ్డీకే దాదాపు అన్ని బ్యాంకులు ఈ లోన్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 24 May 2023, 7:24 pm
Samayam Telugu Overdraft.
Overdraft: ఏదైన అవసరం ఏర్పడినప్పుడు బ్యాంకుకు వెళ్లి వ్యక్తిగత రుణం తీసుకుంటారు. అయితే, చిన్న మొత్తంలో అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. తెలిసిన వారి దగ్గర తీసుకుందామనుకుంటే మనసొప్పదు, అలా అని డబ్బులు లేకుంటే పని జరగదు. అలాంటి వారి కోసం ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది షార్ట్ టర్మ్ లోన్ అని చెప్పాలి. మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటిలో దాదాపు ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. శాలరీ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్లకు ఈ సౌకర్యాన్ని (OD Facility In Banks) అందిస్తుంటాయి. కొన్ని బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ ఫెలిసిటీని షేర్లు, శాలరీ, బాండ్లు, బీమా పాలసీ, ఇంటి ప్రాపర్టీలపైనా అందిస్తాయి

ఓవర్ డ్రాఫ్ట్‌తో ఎంత డ్రా చేయొచ్చు?
ఉద్యోగులు అయితే మీకు అందే జీతంపై 3 రెట్లు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఖాతా నుంచి డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర మార్గాల్లో అయితే, మీరు బ్యాంకు వద్ద తనఖా పెట్టే ప్రాపర్టీపై ఈ లిమిట్ అనేది ఆధారపడి ఉంటుంది. షేర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర విలువైన ఆస్తులను తనాఖా పెట్టి ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందవచ్చు. వడ్డీ కూడా దాని ప్రకారమే నిర్ణయిస్తారు. ఉదాహరణకు మీకు బ్యాంకులో రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉంటే.. మీకు రూ.1.50 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం ఉంటుంది. మీ అకౌంట్లో నెలకు రూ.25 వేల జీతం క్రెడిట్ అవుతుందనుకుంటే.. రూ.75 వేల వరకు ఓవర్ డ్రాప్ట్ ద్వారా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందించేందుకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు, ఇ-మెయిల్స్ ద్వారా సమాచారం చేరవేస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ అనేది బ్యాంకులే నిర్ణయిస్తాయి. ఎమర్జెనీ ఉన్నప్పుడు డబ్బులు అవసరం ఏర్పడితే ఏ విధంగా లోన్‌కు దరఖాస్తు చేసుకుంటారో అలాగే ఓవర్ డ్రాఫ్ట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ మాదిరిగానే వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే ఓవర్ డ్రాఫ్ట్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే తిరిగి చెల్లించేందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎప్పుడైనా చెల్లింపులు చేయవచ్చు. అలాగే లోన్ పేమెంట్ చేసినప్పటికీ ఏ విధమైన ఛార్జీలు (overdraft facility charges) వసూలు చేయవు బ్యాంకులు.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.