యాప్నగరం

ఇక పేటీఎం బాదుడు మొదలైనట్లేనా?

క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వ్యాలెట్ రీఛార్జ్ చేసుకుంటే రెండు శాతం పన్ను విధించనున్నట్లు డిజిటల్ వ్యాలెట్ పేమెంట్ సంస్థ పేటీఎం ప్రకటించింది.

TNN 9 Mar 2017, 2:31 pm
క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వ్యాలెట్ రీఛార్జ్ చేసుకుంటే రెండు శాతం పన్ను విధించనున్నట్లు డిజిటల్ వ్యాలెట్ పేమెంట్ సంస్థ పేటీఎం ప్రకటించింది. అదే సమయంలో డెబిట్ కార్డుల ద్వారా పేటీఎం రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి రుసుం వసూలు చేయబోమని పేటీఎ తెలిపింది. క్రెడిట్ కార్డుదారులపై విధించిన రెండు శాతం ఛార్జీకి సమానంగా క్యాష్ బ్యాక్‌ను 24 గంటల్లోగా అందించనున్నట్లు తెలిపింది. తర్వాతి రోజుల్లో ఆ సంస్థ ఈ క్యాష్ బ్యాక్‌ను ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదు.
Samayam Telugu paytm to levy 2 fee on wallet recharge using credit card
ఇక పేటీఎం బాదుడు మొదలైనట్లేనా?


క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం రీఛార్జీ చేసుకునే చాలా మంది వాటిని బ్యాంకు అకౌంట్‌కు యాడ్ చేసుకుంటున్నారు. దీంతో ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకపోగా క్యాష్ బ్యాక్ సౌలభ్యాన్ని కూడా పొందుతున్నారు. దీంతో దుర్వినియోగాన్ని అరికట్టడానికి క్రెడిట్ కార్డు సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని పేటీఎం పేర్కొంది. ఈ విషయాన్ని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేటీఎం బ్లాగ్ ద్వారా వెల్లడించారు.

మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంక్ అకౌంట్లకు వెంటనే నగదు బదిలీ చేసుకోవడానికి వీలుగా పేటీఎం ఐఎంపీఎస్‌ను ప్రారంభించింది. పరిమితికి మించిన నగదు లావాదేవీలపై బ్యాంకులు భారీగా ఛార్జీల వడ్డనకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.