యాప్నగరం

రైతులకు శుభవార్త.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.3 వేలు.. ఎలా పొందాలంటే..

మీరు వ్యవసాయం చేస్తుంటారా? అయితే మీకు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన గురించి తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు.

Samayam Telugu 11 Jan 2022, 9:00 am

ప్రధానాంశాలు:

  • అన్నదాతలకు తీపికబురు.. మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో
  • ఇందులో చేరితే ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి
  • అయితే 60 ఏళ్లు దాటిన తర్వాతనే ఈ ఫెసిలిటీ
  • దీని కోసం ప్రతి నెలా రూ. 55 నుంచి చెల్లిస్తూ వెళ్లాలి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu farmers
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పలు రకాల పథకాలు అందిస్తోంది. ఇలాంటి పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరిన రైతులకు పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. ఏడాదికి రూ.36 వేలు వస్తాయి. అయితే దీని కోసం రైతులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లాలి.
అన్నదాతలకు ఇది చాలా ఉపయోకరమైన స్కీమ్ అని చెప్పుకోవచ్చు. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. రూ.3 పెన్షన్ వస్తుంది. దీని కోసం పెద్దగా చెల్లించాల్సిన పని లేదు. చిన్న మొత్తంలో ప్రతి నెలా చెల్లిస్తూ వెలితే సరిపోతుంది. నెలకు రూ.55 నుంచి చెల్లించాల్సి వస్తుంది. వయసు ప్రాతిపదికన మీరు చెల్లించే డబ్బులు మారతాయి.

Also Read: undefined

18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 18 ఏళ్ల వయసు ఉన్న వారు పథకంలో చేరితే నెలకు రూ.55 కట్టాలి. అదే 40 ఏళ్ల వయసులో ఉన్న వారు పథకంలో చేరితే నెలకు రుూ.200 కట్టాల్సి వస్తుంది. ఇలా వయసు మారే కొద్ది చెల్లించాల్సిన మొత్తం కూడా మారుతుంది.

Also Read: undefined

5 ఎకరాలలోపు పొలం ఉంటే సరిపోతుంది. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి. ఒకవేళ స్కీమ్‌లో చేరిన రైతు మరణిస్తే.. అప్పుడు వారి భాగస్వామికి 50 శాతం పెన్షన్ వస్తుంది. మీరు దగ్గరిలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పథకంలో చేరొచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తప్పనిసరి. ఆటోడెబిట్ ఫీచర్ ద్వారా ప్రతి నెలా మీ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమెటిక్‌గానే కట్ అవుతాయి. పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారు సులభంగానే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. పీఎం కిసాన్ డబ్బులతోనే ప్రీమియం చెల్లించొచ్చు.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏటా రూ.6 వేలు లభిస్తున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా వస్తాయి. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు రైతులకు రూ.20 వేల వచ్చాయి.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.