యాప్నగరం

Post Office అదిరే స్కీమ్‌.. రూ.లక్షకు రూ.2 లక్షలు.. రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు!

మీరు పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి. రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.

Samayam Telugu 15 Oct 2021, 6:18 am

ప్రధానాంశాలు:

  • పోస్టాఫీస్ అదిరిపోయే పథకం
  • డబ్బులు రెట్టింపు
  • రూ.1000 నుంచి పెట్టొచ్చు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu india post
పోస్టాఫీస్ ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ప్రజలకు పలు రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు పొందొచ్చు. రిస్క్ ఉండదు. అలాగే కచ్చితమైన రాబడి పొందొచ్చు. ఇంకా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌లో కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఒకటుంది. ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది.

Also Read: undefined

మీరు ఈ పథకంలో డబ్బులు పెడితే 10 ఏళ్ల 4 నెలల్లో డబ్బులు రెట్టింపు అవుతాయి. అంటే 124 నెలల్లో మనీ డబుల్ అవుతుంది. మీరు రూ,.1000 నుంచి డబ్బులు దాచుకోవచ్చు. రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి.

18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి స్కీమ్ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లి ఈ పథకంలో వెంటనే చేరొచ్చు. దీర్ఘకాల లక్ష్యాలు కలిగిన వారికి ఈ స్కీమ్ అనువుగా ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.