యాప్నగరం

SBI సూపర్ స్కీమ్.. చేరితే రూ.40 లక్షలు పొందొచ్చు.. ఇలా చేయండి!

Public Provident Fund : మీరు ఏకంగా రూ. 40 లక్షలకు పైగా పొందాలని చూస్తున్నారా? అయితే మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరితో ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టిన డబ్బులు పూర్తి భద్రంగా ఉంటాయి. అలాగే భారీగా వడ్డీ కూడా వస్తుంది. అంతేకాకుండా మరో ప్రయోజనం కూడా ఉంది. అదే పన్ను మినహాయింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. అయితే దీర్ఘకాలం వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

Authored byKhalimastan | Samayam Telugu 27 Jun 2022, 7:40 am

ప్రధానాంశాలు:

  • రిస్క్ లేకుండా రాబడి పొందాలని చూస్తున్నారా?
  • అయితే మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది
  • ఇందులో చేరితో మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం
  • అయితే దీర్ఘకాలం వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi ppf account
ఎస్‌బీఐ స్కీమ్‌తో లక్షాధికారి అయిపోండి
PPF Interest Rate : రిస్క్ లేని రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవే స్మాల్ సేవింగ్ స్కీమ్స్. వీటిల్లో మీరు మీకు నచ్చిన పథకాన్ని ఎంచుకోవచ్చు. అయితే పన్ను మినహాయింపు ప్రయోజనాలతో పాటుగా మంచి రాబడి పొందాలని భావిస్తే మాత్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరితే ట్యాక్స్ బెనిఫిట్స్‌తో పాటు రాబడి కూడా పొందొచ్చు. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సురక్షితంగా ఉంటాయి. ఈ స్కీమ్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ లేదంటే ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకులకు వెళ్లి పీపీఎఫ్ స్కీమ్‌‌లో చేరొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు్. అంటే మీరు 15 ఏళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్లాలి. మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా ఏడాదికి రూ. 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నెలకు రూ. 12,500 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వపు హామీ ఉంటుంది.

Also Read: undefined

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అయితే ఈ వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేటును సమీక్షిస్తూ వస్తుంది. అందువల్ల వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. ఈ పథకంలో భారతీయ పౌరులు ఎవరైనా చేరొచ్చు. పిల్లల పేరుపై కూడా ఈ ఖాతాను తెరవొచ్చు. ఆధార్, పాన్ కార్డు, ఫోటోలు, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. బ్యాంకులు ఆన్‌లైన్‌లో కూడా పీపీఎఫ్ ఖాతాను తెరిచే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

మీరు ఈ స్కీమ్‌లో చేరితే మెచ్యూరిటీలో ఎలాంటి మొత్తం పొందొచ్చొ ఒకసారి తెలుసుకుందాం. మీరు నెలకు రూ. 12,500 డిపాజిట్ చేయాలని భావిస్తే.. ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ. 40 లక్షలకు పైగా వస్తాయి. ఇందులో వడ్డీ మొత్తమే రూ. 18 లక్షలకు పైగా ఉంటుంది. అంటే రిస్క్ లేకుండా భారీ రాబడి పొందొచ్చు. అయితే దీర్ఘకాలం వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు మెచ్యూరిటీ తర్వాత స్కీమ్ కాలాన్ని మరింత పొడిగించుకోవాలని భావిస్తే.. అంటే మరో ఐదేళ్లు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకుంటే మరింత బెనిఫిట్ లభిస్తుంది.

Also Read: undefined

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.