యాప్నగరం

పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ.5 వేలతో రూ.7 లక్షలకు పైగా పొందండి!

పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో ఇన్సూరెన్స్ పథకాలు కూడా ఉన్నాయి. గ్రామ్ ప్రియా పాలసీ కూడా ఇందులో ఒకటి. ఈ పథకంలో చేరితే తక్కువ ప్రీమియంతో అధిక రాబడి పొందొచ్చు. ఇన్సూరెన్స్ కూడా వస్తుంది.

Samayam Telugu 17 May 2021, 12:13 pm

ప్రధానాంశాలు:

  • పోస్టల్ అదిరే పాలసీ
  • మనీ బ్యాక్ పాలసీ
  • 20 ఏళ్లు ఉన్న వారు చేరొచ్చు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu post office
పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి. వీటిల్లో గ్రామ్ ప్రియా స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ గడువు పదేళ్లు. రూరల్ పోస్టల్ లైఫ ఇన్సూరెన్స్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల తక్కువ ప్రీమియంతో అధిక రాబడి పొందొచ్చు.
పోస్టల్ గ్రామ్ ప్రియా స్కీమ్‌లో చేరాలని భావించే వారికి కనీసం 20 ఏళ్ల వయసు ఉండాలి. గరిష్టంగా 45 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పాలసీ టర్మ్ పదేళ్లు ఉంటుంది. కనీసం రూ.10 వేల మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. అలాగే గరిష్టంగా రూ.10 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ పొందొచ్చు.

Also Read: undefined

ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. మనీ బ్యాక్ పాలసీ కూడా. నాలుగేళ్ల తర్వాత పాలసీ మొత్తంలో 20 శాతం మొత్తాన్ని పొందొచ్చు. 7 ఏళ్ల తర్వాత మరో 20 శాతం డబ్బులు తీసుకోవచ్చు. ఇక పదేళ్ల తర్వాత మిగిలిన 60 శాతం మొత్తం డబ్బులు వస్తాయి. ఇంకా బోనస్ కూడా వస్తుంది.

పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. నామినీకి బీమా మొత్తంతోపాటు బోనస్ వంటివి కూడా లభిస్తాయి. పాలసీ ప్రీమియం మొత్తం వయసు ప్రాతిపదికన మారుతుంది. రూ.5 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలవారీ ప్రీమియం దాదాపు రూ.5 వేలు అవుతుంది. మీ చేతికి మొత్తంగా రూ.7.25 లక్షలు వస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.