యాప్నగరం

PMJJBY Renewal: బ్యాంక్ అకౌంట్‌లో రూ.350 పెట్టుకోండి.. లేదంటే రూ. 4 లక్షలు నష్టపోయినట్లే!

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: మీరు జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా జ్యోతి పథకాల్లో చేరారా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మీ అకౌంట్‌లో కనీసం రూ. 350 ఉండేలా చూసుకోండి. ఈ నెల చివరి కల్లా మీ అకౌంట్ నుంచి ఈ డబ్బులు కట్ అవుతాయి. ఒకవేళ మీ అకౌంట్‌లో డబ్బులు లేకపోతే మాత్రం మీరు ఈ రెండు పథకాల ప్రయోజనాలు పొందలేదు.

Authored byKhalimastan | Samayam Telugu 26 May 2022, 9:22 am

ప్రధానాంశాలు:

  • బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్
  • సేవింగ్స్ ఖాతాలో రూ.350 ఉండేలా చూసుకోండి
  • లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు
  • రూ. 4 లక్షల వరకు ప్రయోజనం కోల్పోవచ్చు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu insurance latest news
PMSBY Renewal: బ్యాంక్ అకౌంట్‌లో కనీసం మినిమమ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంత మంది బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉంచకపోవచ్చు. పూర్తిగా డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే పలు ప్రయోజనాలు కోల్పోవలసి వస్తుంది. ఎలా అన్ని అనుకుంటున్నారా? ఏకంగా రూ. 4 లక్షల వరకు ప్రయోజనం మిస్ కావొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు రకాల పథకాలు అందిస్తోంది. ఇవి ఇన్సూరెన్స్ స్కీమ్స్. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అనే రెండు పథకాలను అందిస్తోంది. వీటి ద్వారా చాలా మంది ప్రయోజనం పొందొచ్చు. వీటిల్లో చేరడం వల్ల రూ. 4 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు.
రెన్యూవల్‌కు మే 31 వరకు గడువు
ఈ రెండు స్కీమ్స్‌లో చేరిన వారికి మే 31 రెన్యూవల్ డేట్‌గా ఉంది. అందువల్ల మీరు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉండేలా చూసుకోవాలి. లేదంటే రెన్యూవల్ చేసుకోవడం కుదరదు. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కాకపోతే మీరు ఈ పథకాల ప్రయోజనాలు పొందలేరు. అందువల్ల కచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌లో రూ.350 వరకు ఉండేలా చూసుకోండి.

Also Read: undefined

జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది టర్మ్ ఇన్సూరెన్స్. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. రూ.2 లక్షల వరకు లైఫ్ కవర్ లభిస్తుంది. ఈ పాలసీ జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏడాది రెన్యూవల్ చేసుకోవాలి. ఏ కారణం చేతనైనా పాలసీ తీసుకున్న వారు మరణిస్తే.. వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఈ పాలసీ ప్రీమియం రూ. 330. ప్రతి ఏడాది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.330 కట్ అవుతూ వస్తాయి. అందుకే మే 31లోపు ఎప్పుడైనా డబ్బులు కట్ కావొచ్చు. అందుకే బ్యాంక్ అకౌంట్‌లో రూ.330 ఉండేలా చూసుకోవాలి.

Also Read: undefined

సురక్ష బీమా యోజన
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అనేది పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఒకవేళ ప్రమాదంలో అగవైకల్యం సంభవించినా కూడా ఈ బీమా మొత్తం వస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ప్రీమియం ఏడాదికి రూ. 12గా ఉంది. ప్రతి ఏటా రూ.12 మీ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. ఈ పాలసీ కూడా జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంటాయి.

రూ. 342 ఉండేలా చూసుకోండి
చాలా మంది ఈ రెండు స్కీమ్స్‌లో చేరి ఉంటారు. అందువల్ల మే నెల చివరకు వచ్చేస్తున్నాం. అందువల్ల మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.342 ఉండేలా చూసుకోవాలి. సురక్ష బీమా యోజన ప్రీమియం రూ.12, జీవన్ జ్యోతి బీమా ప్రీమియం రూ.330.. రెండూ కట్ అవుతాయి. అందువల్ల బ్యాంక్ అకౌంట్‌లో రూ.350 ఉండేలా చూసుకోండి. లేదంటే ఈ ప్రయోజనాలు కోల్పోతారు.

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.