ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల FD లపై వడ్డీ రేట్లను తగ్గించేసింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడాది, రెండేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఇకపోతే మిగతా కాల పరిమితిల్లోని ఎఫ్డీలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల కోత నిర్ణయం నవంబర్ 13 నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది.
Also Read: undefined
రేట్ల కోత నిర్ణయం తర్వాత.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లను గమనిస్తే.. 7 రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలోని ఎఫ్డీలపై 2.5 శాతం వడ్డీ వస్తుంది. 30 నుంచి 90 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ పొందొచ్చు. 91 రోజుల నుంచి 6 నెలల కాల పరిమితిలోని ఎఫ్డీలపై 3.5 శాతం వడ్డీ వస్తుంది. 6 నెలల నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.4 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
Also Read: undefined
ఇక ఏడాది కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.9 శాతం వడ్డీ వస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏడాది, రెండేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇప్పుడు ఈ డిపాజిట్లపై కస్టమర్లకు 4.9 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
ఇక 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై 5.15 శాతం వడ్డీ వస్తుంది. 3 నుంచి 5 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై 5.3 శాతం వడ్డీ రేటు ఉంది. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ వస్తుంది.