యాప్నగరం

ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టక్కర్లేదు!

రిజర్వు బ్యాంక్ లోన్ మారటోరియం ఫెసిలిటీని మరి కొంత కాలం పొడిగించింది. ఆగస్ట్ 31 వరకు ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఆర్‌బీఐ బాటలోనే నడుస్తున్నాయి. కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.

Samayam Telugu 1 Jun 2020, 9:33 am
కరోనా వైరస్ వల్ల ఆదాయం తగ్గిపోయిందా? క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? అయితే మీకు శుభవార్త. తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు అందించింది. క్రెడిట్ కార్డు బిల్లుపై మారటోరియం ఫెసిలిటీ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఆప్షన్ ఎంచుకున్న వారు క్రెడిట్ కార్డు బిల్లు ఆగస్ట్ 31 వరకు చెల్లించాల్సిన పని లేదు.
Samayam Telugu CREDit card news


రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలనే లోన్ మారటోరియం ఫెసిలిటీ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరో మూడు నెలలు ఈఎంఐ మారటోరియం గడువు పొడిగించాలని పేర్కొంది. అన్ని టర్మ్ లోన్స్‌కు, క్రెడిట్ కార్డు బకాయిలకు ఇది వర్తిస్తుంది. దీంతో దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా లోన్ ఈఎంఐ మారటోరియం ఫఎసిలిటీని మరో 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది.

Also Read: undefined

అయితే క్రెడిట్ కార్డు బిల్లుపై మారటోరియం ఆప్షన్ ఎంచుకునే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మారటోరియం గడువు అయిపోయిన తర్వాత జనరేట్ అయిన క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మీరు నిర్వహించిన లావాదేవీలు, అలాగే వీటిపై వడ్డీ వంటివి అన్నీ ఉంటాయి.

Also Read: undefined

ఒకవేళ క్రెడిట్ కార్డుపై ఈఎంఐ ఉంటే.. ఈఎంఐ మాత్రం నెలవారీ బిల్లులో వస్తుంది. దీన్ని చెల్లించాలి. ఒకవేళ కట్టకపోతే వడ్డీ పడుతుంది. ఒకవేళ ఆటో డెబిట్ ఫెసిలిటీని యాక్టివేట్ చేసుకొని ఉంటే.. మారటోరియం ఎంచుకుంటే డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ కావు. మీరు ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ కార్డులు ఉపయోగిస్తూ ఉంటే.. అప్పుడు ప్రతి కార్డుకు మారటోరియం ఫెసిలిటీ వర్తిస్తుంది.

ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లుకు మారటోరియంను ఒకేసారి ఒక నెల కన్నా ఎక్కువగా పొందటం సాధ్యం కాదు. అందువల్ల ప్రతి నెలా మారటోరియం కోసం అప్లై చేసుకోవలసి ఉంటుంది. అంటే ఒకేసారి మూడు నెలలకు మారటోరియం ఫెసిలిటీ పొందలేం. ప్రతి నెలా అప్లై చేసుకోవాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.