యాప్నగరం

మల్టీప్లెక్సులకు ప్రభుత్వం షాక్!

అత్యధిక టిక్కెట్ ధరలతో సినీ ప్రేమికుల జేబులకు చిల్లులు పెడుతున్న మల్టీప్లెక్సులకు కర్ణాటక ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.

TNN 15 Mar 2017, 3:44 pm
అత్యధిక టిక్కెట్ ధరలతో సినీ ప్రేమికుల జేబులకు చిల్లులు పెడుతున్న మల్టీప్లెక్సులకు కర్ణాటక ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మల్టీప్లెక్స్‌లలో ఇకపై టికెట్ ధర రూ. 200 మించకూడదని నిబంధన విధించింది. బుధవారం కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య ప్రభుత్వం మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరలపై ఆంక్షలు విధించింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ పీవీఆర్ సినిమాస్ షేర్లు 6 శాతం పడిపోయాయి.
Samayam Telugu pvr falls 6 as karnataka govt caps ticket fee at rs 200
మల్టీప్లెక్సులకు ప్రభుత్వం షాక్!


బడ్జెట్‌కు ముందు పీవీఆర్ షేర్లు పటిష్ఠ స్థితిలో ఉన్నాయి. గత నెలరోజుల్లో 9 శాతం పెరిగిన షేర్లు ఈ ఒక్క నిర్ణయంతో 6 శాతం పడిపోయాయి. బుధవారం మధ్యాహ్నం 2.04 గంటలకు బొబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో తమ షేర్ ధరను రూ. 1,401 వద్ద పీవీఆర్ మొదలుపెట్టింది. ఒకానొక దశలో 1,447.90కు చేరుకున్న షేర్ ధర కర్ణాటక బడ్జెట్ ప్రకటన అనంతరం రూ. 1,364.80కి పడిపోయింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బెంగళూరులోని మల్టీప్లెక్స్‌లు సినీ ప్రేమికుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. సినిమా పాపులారిటీ, వారాంతపు రోజులను బట్టి టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. పీవీఆర్ లాంటి మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు రూ. 500 నుంచి రూ. 1000 వరకు వసూలు చేసిన రోజులున్నాయి. దీన్ని అరికట్టడానికే కర్ణాటక ప్రభుత్వం టిక్కెట్ అత్యధిక ధరను రూ. 200గా నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని మల్టీప్లె్క్స్ కంపెనీలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.